ట్రైన్ దిగుతుండగా డ్రైనేజీలో పడిన చిన్నారి.. వీడియో వైరల్

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.ఒక్కొక్కసారి అనుకోని విధంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

 Baby Falls Into Drain As Mother Loses Grip While Stepping Out From Mumbai Local-TeluguStop.com

ఇవి విషాదానికి తారితీస్తూ ఉంటాయి.ప్రమాదవశాత్తూ జరిగే ప్రమాదాలను ఎవరూ ఆపలేరు.

ఇలాంటి ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.అలాగే కొన్ని ప్రమాదాల్లో ఆచూకీ కూడా లభించలేదు.

తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

ముంబై ట్రైన్ లో( Mumbai Train ) విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ఒక మహిళ ట్రైన్ దిగుతుండగా పట్టు తప్పింది.ఈ క్రమంలో తల్లి చేతుల్లోని చిన్నారి జారి డైనేజీలో( Drinage ) పడింది.

ముంబైలో ఒక మహిళ లోకల్ ట్రైన్ ఎక్కింది.కానీ లోకల్ ట్రైన్ ఆగిపోవడంతో మధ్యలో దిగింది.

చేతిలో పాపను పట్టుకుని కిందకు దిగుతుంది.ఈ సమయంలో ఆమె పట్టు కోల్పోవడంతో చేతిలోని చిన్నారి జారి అక్కడే ఉన్న డ్రైనేజీలో పడిపోయింది.

మహిళ పేరు యువతి అని తెలుస్తుండగా.పాప పేరు రిషికగా చెబుతున్నారు.

ట్రైన్ ఆపేసి చిన్నారి రిషిక( Rishika ) కోసం అధికారులు ప్రయత్నాలు చేశారు.

ట్రైన్ లోని ప్యాసింజర్లు కూడా చిన్నారి ఆచూకీని కనిపెట్టేందుకు సహాయం చేశారు.కూతురు కోసం డ్రైనేజీ దగ్గర తల్లి తల్లడిల్లిపోయింది.తన బిడ్డను కాపాడాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

పాపను రక్షించాలని, ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటకు రావాలని కొంతమంది నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

చిన్నారులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ముందు, వెనుకా చూసుకుని నడవాలని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ తల్లి బాధ మాటల్లో చెప్పలేనిది అని మరికొందరు అంటున్నారు.బిడ్డ సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటుున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ట్రైన్ దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరికొందరు అంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube