వెస్టిండీస్( West Indies ) పర్యటనలో ఉన్న భారత జట్టులో చోటు దక్కించుకున్న శుబ్ మన్ గిల్ ( Shubman Gill )రెండు టెస్ట్ మ్యాచ్ లలో చెత్త ఇన్నింగ్స్ ఆడి అందరిని నిరాశపరిచాడు.మంచి ఫామ్ లో ఉన్న ఆటగాడిపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
అలా అని ప్రతి మ్యాచ్ లో సెంచరీ లేదంటే అర్థ సెంచరీ కచ్చితంగా సాధించాలని కోరుకోరు.కాకపోతే కాస్త అద్భుత ఆట ప్రదర్శన చేసి కనీస పరుగులైన చేయాలని కోరుకుంటారు.
అలాకాకుండా పూర్తిగా విఫలం అయితే ఇక ఫాన్స్ విమర్శలకు అడ్డు అదుపు అనేదే ఉండదు.సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మామూలుగా ఉండవు.
ప్రస్తుతం శుబ్ మన్ గిల్ పై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

డోమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో గిల్ 11 బంతుల్లో ఆరు పరుగులు చేసి, విండీస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్ లో అలిక్ అథనాజ్( Alik Athanaz ) కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.కానీ ఫ్యాన్స్ ఎటువంటి విమర్శలు చేయలేదు.కానీ ఇప్పుడు ట్రినిడాడ్ లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 12 బంతులకు 10 పరుగులు చేసి, కీమర్ రొచ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జాషువా( Joshua ) కు టచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
దీంతో గిల్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.కనీసం ఎక్కువ సమయం క్రీజూలో ఉండే ప్రయత్నం చేస్తే నెమ్మదిగా పరుగులు వస్తాయి కదా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలతో రెచ్చిపోతున్నారు.

ఓ ఫ్యాన్ అయితే ఏకంగా అన్ని మ్యాచ్లు అహ్మదాబాద్ స్టేడియంలో ( Ahmedabad Stadium )జరిగేలా చూడండి.అహ్మదాబాద్ పిచ్చులపై మాత్రమే బాగా బ్యాటింగ్ చేయగలను అని గిల్, రాహుల్ ద్రావిడ్ ను కోరాలంటూ సెటైర్లు వేస్తున్నారు.ఎందుకంటే అహ్మదాబాద్ స్టేడియంలో గిల్ మూడు సెంచరీలు చేశాడు.అంతేకాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు కాబట్టి వీటిని ఉద్దేశిస్తూ ఫ్యాన్స్ పలు కౌంటర్లు వేస్తున్నారు.







