NTR: ఎన్టీఆర్ కు విపరీతమైన కోపం తీసుకొచ్చేది అదేనా.. ఆ మాటలకు బీపీ అంత పెరుగుతుందా?

కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది.ఇక ఆ కోపాన్ని కొందరు అదుపులో పెట్టుకుంటే మరి కొంతమంది ఆవేశంలో ప్రదర్శిస్తూ ఉంటారు.

 Is That What Makes Ntr So Angry-TeluguStop.com

నిజానికి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మామూలు విషయం కాదని చెప్పాలి.కొన్ని కొన్ని సార్లు కోపంలో ఏం చేస్తుంటామో కూడా అర్థం కాదు.

అందుకే అటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం.అయితే సెలబ్రెటీలకు కూడా బాగా కోపాలు వస్తూ ఉంటాయి.

నిజానికి వాళ్ళు ఎప్పుడు చూసినా బాగా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు.

పైగా చేతినిండా డబ్బు.

అనుకున్నది క్షణాల్లో ముందుంటుంది.అన్ని రకాలుగా వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు వారిలో కూడా కోపాలు, బాధలు, కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి.

ఇక వాటిని వాళ్ళు బయటకు పెట్టకుండా లోలోపలే ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు.అయితే కొంతమంది మాత్రం వెంటనే బయటికి చూపిస్తూ ఉంటారు.

ముఖ్యంగా కోపాన్ని( Anger ) ఏమాత్రం కంట్రోల్ చేసుకోకుండా చూపిస్తూ ఉంటారు.అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు.కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు.

సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత హీరోగా ఎదిగి మంచి బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్నాడు.ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాల్లోనే మెప్పించాడు.

Telugu Anchor Suma, Bigg Boss, Jr Ntr, Ntr, Meeloevaru, Ntr Angry, Rrr, Tollywoo

మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ కూడా అవన్నీ కామన్ అనుకొని మళ్లీ ముందడుగు వేసి బ్లాక్ బస్టర్ లే అందుకున్నాడు.మధ్యలో బుల్లితెరపై బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు అనే రియాలిటీ షోలు కూడా చేసి వ్యాఖ్యాతగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఏడాది కిందట ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

Telugu Anchor Suma, Bigg Boss, Jr Ntr, Ntr, Meeloevaru, Ntr Angry, Rrr, Tollywoo

అయితే ఈ సందర్భంగా ఆయన గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే ఎన్టీఆర్ కు బాగా కోపం ఎక్కువ అని ఆ కోపం ఆయనకు కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంటుంది అని తెలిసింది.మామూలుగా ఇప్పటివరకు ఎన్టీఆర్ కోపాన్ని( NTR Anger ) మనం సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడలేదు.కానీ కొన్ని రోజుల కిందట ఒక ఈవెంట్ లో యాంకర్ సుమ( Anchor Suma ) ఎన్టీఆర్ ను సినిమా గురించి అడగటంతో.

వెంటనే ఎన్టీఆర్ కళ్ళు పెద్దగా చేసి తనపై కోపంగా చూశాడు.ఆ సమయంలో అందరూ ఎన్టీఆర్ కి కోపం వచ్చింది అంటూ ఆ వీడియోను బాగా వైరల్ చేశారు.

Telugu Anchor Suma, Bigg Boss, Jr Ntr, Ntr, Meeloevaru, Ntr Angry, Rrr, Tollywoo

అయితే ఇంకొక విషయం గురించి మాట్లాడితే మాత్రం ఎన్టీఆర్ కు విపరీతమైన కోపం వస్తుందట.ఇంతకు అదేంటంటే.చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ కు ఆడవాళ్లు అంటే చాలా గౌరవం.అయితే ఎవరైనా వ్యక్తులు అమ్మాయిల, ఆడవాళ్ళ గురించి వల్గర్ గా మాట్లాడిన, వారితో అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే ఎన్టీఆర్ కు విపరీతమైన కోపంతో పాటు ఆయన బీపీ 170 దాటిపోతుంది అని.అంతేకాకుండా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడిన వారి చెంప చెల్లుమనిపిస్తాడు అని తెలిసింది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube