వీసా గడువు ముగిసినా ఆశ్రయం.. ఆపై వెట్టిచాకిరి, అమెరికాలో భారత సంతతి జంట పైశాచికం

తమ బంధువుని కన్వీనియన్స్ స్టోర్‌లో బలవంతంగా వుంచడమే కాకుండా శ్రమ దోపిడీకి పాల్పడటం, శారీరక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై అమెరికాలో భారత సంతతి జంటపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే.

 Indian-origin Couple Charged With Committing Forced Labour In America Details, I-TeluguStop.com

వర్జీనియాకు చెందిన హర్మన్‌ప్రీత్ సింగ్ (30),( Harmanpreet Singh ) కుల్బీర్ కౌర్ (42)లు( Kulbir Kaur ) బాధితుడి ఇమ్మిగ్రేషన్ పత్రాలను లాక్కొన్నారు.ఆపై శారీరకంగా, మానసికంగా వేధించారు.

మార్చి 2018 నుంచి మే 2021 మధ్య కనీస వేతనం ఇవ్వాలంటే ఎక్కువసేపు పనిచేయాల్సిందిగా వీరిద్దరూ హింసించారు.

బాధితుడిని నార్త్ చెస్టర్‌ఫీల్డ్‌లోని సింగ్ స్టోర్‌లో( Singh Store ) క్యాషియర్‌గా పనిచేయడం, ఆహారాన్ని తయారు చేయడం, స్టోర్ రికార్డులను శుభ్రపరచడం , వాటిని నిర్వహించడం వంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు.

ఈ ఘటనపై వర్జీనియా ఈస్ట్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో స్పందించింది.నిందితులు బాధితుడి ఇమ్మిగ్రేషన్ పత్రాలను లాక్కొన్నారని.ఆపై నార్త్ చెస్టర్‌ఫీల్డ్‌లోని కన్వీనియన్స్ స్టోర్‌లో శారీరకంగా, మానసికంగా వేధించారని అటార్నీ కార్యాలయం తెలిపింది.

Telugu America, Cashier, Forced, Indian Origin, Kulbir Kaur, Chesterfield, Singh

అయితే బాధితుడి పేరును మాత్రం అధికారులు ప్రస్తావించలేదు.ఈ నేరానికి సంబంధించి ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ( Federal Grand Jury ) బుధవారం వీరిపై ఏడు కౌంట్ల నేరారోపణలను చేసింది.బలవంతంగా పనిచేయడం,( Forced Labour ) ఆర్ధిక ప్రయోజనాల కోసం విదేశీయుడికి ఆశ్రయం కల్పించడం , మోసం, మోసపూరిత బదిలీలు వంటి ఆరోపణలపై అభియోగాలను నమోదు చేశారు.

వీరి ఆర్ధిక ప్రయోజనాల కోసం వీసా గడువు ముగిసినప్పటికీ నిందితులు బాధితుడికి ఆశ్రయం కల్పించారని పోలీసులు తెలిపారు.

Telugu America, Cashier, Forced, Indian Origin, Kulbir Kaur, Chesterfield, Singh

అమెరికా చట్టాల ప్రకారం. బలవంతంగా వెట్టిచాకిరి చేయించినందుకు గాను గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల తర్వాత పర్యవేక్షణతో కూడిన విడుదల, 2,50,000 డాలర్ల జరిమానా తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు.ఫెడరల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి.

అమెరికా శిక్షా స్మృతిని అనుసరించి.ఇతర చట్టబద్ధమైన అంశాలను పరిగణనలోనికి తీసుకున్న తర్వాత శిక్షను నిర్ణయిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube