పవన్ హస్తిన ప్రయాణం లక్ష్యం నెరవేరుతుందా?

ఎన్డీఏ పార్టీల కూటమి మీటింగ్కు అధికార బాజాపా ఆహ్వానం మేరకు ఢిల్లీ ప్రయాణమైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన అజెండా ప్రకారం కొన్ని కీలక చర్చలు జరపబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి తెలుగుదేశంతో పొత్తుకు అంతగా ఉత్సాహం చూపించినటువంటి భాజపా పెద్దలను రాజకీయంగా ఈ పొత్తు ఎంత అత్యవసరమో పవన్ వివరించబోతున్నారని ఈ దిశగా కొన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ లతో సహా పవన్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రెడీ చేశారని, ఎన్డీఏ మీటింగ్( NDA Meeting ) తర్వాత బిజెపి కీలక నేతలతో అపాయింట్మెంట్ కోరిన పవన్ ఆ దిశగా వారికి వివరించి పోత్తులు ఫైనల్ చేయబోతున్నారని కూడా ఊహాగానాలు చాలారేగుతున్నాయి .

 Pawan Kalyan Meeting With Bjp Senior Leaders,tdp,bjp,janasena,ycp,alliance,nda M-TeluguStop.com
Telugu Alliance, Ap, Janasena, Nda, Pawankalyan-Politics

అయితే ఇప్పటివరకు పవన్ కి సమయం ఇస్తారో లేదో ఇంకా తేలలేదు.ఎన్డీఏ మీటింగ్ పూర్తి అయినా కూడా పవన్ ఒకరోజు అక్కడే ఉన్నారు.అయితే ఎన్నికలు దగ్గరలో ఉన్నందున పొత్తులపై వ్యవహారాన్ని ఇప్పుడే తేల్చేసుకుంటే భవిష్యత్తు కార్యాచరణ సులువుతుందని భావిస్తున్న పవన్ భాజాపా పెద్దల అపాయింట్మెంట్( BJP Leaders ) కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

తెలుగుదేశంతో పొత్తు లేకుంటే అధికార వైసీపీ( YCP )ని ఓడించడం కష్టమని పవన్కళ్యాణ్ నమ్ముతున్నారని అందువల్ల తెలుగుదేశం( TDP )తో కలిసి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి బిజెపి పెద్దలను ఒప్పించగలనన్న ఆత్మవిశ్వాసాన్ని పవను వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేక వోటు ఏ రూపం లో చీలినా కూడా అదీ అదికార పార్టీకి అనుకూలం గా మారుతుందని ఇప్పటికే తన సంక్షేమ పధకాలు మరియు వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ కు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందని అందువల్ల జనసేన -తెలుగుదేశం మరియు బిజేపి( Janasena TDP BJP Alliance ) కలిస్తేనే విన్నింగ్ కాంబినేషన్ అవుతుందని పవన్ బావిస్తున్నట్టుగా తెలుస్తుంది

Telugu Alliance, Ap, Janasena, Nda, Pawankalyan-Politics

నేషనల్ మీడియా( National Media )తో మాట్లాడినప్పుడు కూడా పవన్ ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు పొత్తు ఉంటుందని తాను ఆశిస్తున్నాను అంటూ తన అభిప్రాయాన్ని ఓపెన్ గానే చెప్పారు.తద్వారా తన రాజకీయ ప్రయాణం పై ఖచ్చితమైన అంచనాతోనే ఉన్న పవన్ కేంద్ర పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చిన పొత్తును కన్ఫామ్ చేసుకోవాలని దృడ నిశ్చయం తోనే ఉన్నట్లుగా తెలుస్తుంది మరి పవన్ డిల్లీ ప్రయాణం గమ్యం చేరుతుందో లేదో మరికొద్ది రోజుల్లో ఒక ఒక అంచనాకు రావచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube