బుల్లితెర మీద కొన్ని షో లతో సక్సెస్ అయి చాలా మంది ఇప్పుడు వెండితెర కి పరిచయం అవుతున్నారు కానీ అప్పట్లో వచ్చిన కలర్స్ అనే షో ద్వారా చాలా పాపులర్ అయిన స్వాతి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా మారి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది… అయితే స్వాతి మొదట తెలుగు,తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో కొన్ని సినిమాల్లో నటించి హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఇక తమిళం లో సుబ్రమణ్యపురం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తెలుగులో డేంజర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నాని హీరోగా వచ్చిన అష్టా చమ్మా తో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.అలా ఎన్నో సినిమాల్లో చేసి నటిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
సుబ్రమణ్యపురం, అష్టాచమ్మా, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, గోల్కొండ హై స్కూల్ వంటి సినిమాల్లో నటించింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో పంచతంత్రం, ఇడియట్స్ వంటి సినిమాల్లో మెరిసింది.
అయితే ఈ హీరోయిన్ ఈ మధ్య కాలంలో తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అని వార్తలు వినిపించాయి.ఇక ఈ విషయం పక్కన పెడితే గతంలో ఆ స్టార్ హీరోతో చేస్తే చంపేస్తా అని కలర్స్ స్వాతి కి వార్నింగ్ ఇచ్చారట.
మరి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.కలర్స్ స్వాతి( Colours Swathi ) నిఖిల్( Nikhil Siddhartha ) కాంబినేషన్లో స్వామి రారా, కార్తికేయ( Karthikeya ) వంటి రెండు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాలు వరుసగా రావడంతో వీరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి.దాంతో ఈ విషయం తెలిసిన స్వాతి కుటుంబ సభ్యులు ఇంకొకసారి నిఖిల్ తో సినిమాలో నటిస్తే నిన్ను చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారట.అంతేకాదు సినిమాలకు కూడా బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది అని బెదిరించే సరికి కలర్స్ స్వాతి నిఖిల్ తో నెక్స్ట్ రాబోయే శంకరాభరణం ( Sankarabharanam )సినిమాకి ఓకే చెప్పి పేరెంట్స్ బెదిరించడంతో ఆ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిందట.ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్వాతి ఇప్పుడు కూడా కొన్ని సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది…








