ఆస్ట్రేలియా బీచ్‌కు కొట్టుకొచ్చిన రాకెట్ పార్ట్ ఇండియాదేనా.. ఇస్రో సంచలన ప్రకటన..

ఆస్ట్రేలియాలోని బీచ్‌కి( Australia Beach ) ఓ మిస్టీరియస్ వస్తువు కొట్టుకొచ్చింది.జులై 15న పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్‌లోని బీచ్ సమీపంలో ఈ వస్తువు కనిపించింది.

 Isro Chief Clarification On Mysterious Metal Dome Found On Australian Beach Deta-TeluguStop.com

ఇది ఒక రాకెట్ పార్ట్( Rocket Part ) అని తెలుస్తోంది.ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి( ISRO ) చెందిన రాకెట్‌లోని పార్ట్ అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్( ISRO Chief Somanath ) ఈ విషయమై తాజాగా స్పందించారు.ఆస్ట్రేలియాలో డోమ్ ఆకారంలో పడి ఉన్న ఒక రాకెట్ భాగం దొరికినట్లు చెప్పారు.

దానిని విశ్లేషించే వరకు అది ఇండియాదేనా కాదా అనేది కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు.బహుశా అది పీఎస్ఎల్‌వీ రాకెట్ పార్ట్ అయి ఉంటుందని అతను అభిప్రాయపడ్డారు.

పీఎస్‌ఎల్‌వీలో కొన్ని భాగాలు ఆస్ట్రేలియా ప్రత్యేక ఎకనామిక్ జోన్ దాటి సముద్రంలో పడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఆస్ట్రేలియా బీచ్‌లో ప్రత్యక్షమైన ఆ వస్తువు మాత్రం రాకెట్‌లో భాగమే అని క్లారిటీ ఇచ్చారు.

అది చాలా రోజులు సముద్రంలో ఉండి, చివరికి అలల వల్ల బయటికి కొట్టుకొని వచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు.కానీ నిర్ధారించడానికి దానిని వ్యక్తిగతంగా చూడాలని తెలిపారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ( Australian Space Agency ) దీనిని పరిశీలిస్తోంది.గ్లోబల్ స్పేస్ ఏజెన్సీల నుంచి సహాయం కోరుతోంది.వస్తువును తాకవద్దని లేదా తరలించవద్దని, వారు కనుగొన్న ఇతర శిధిలాల గురించి నివేదించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.కొంతమంది నిపుణులు ఆ వస్తువు భారతీయ రాకెట్ నుంచి ఊడిపడిన ఇంధన సిలిండర్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇది చంద్రయాన్-3( Chandrayaan-3 ) అనే లేటెస్ట్ మిషన్ నుంచి పడిపోయి ఉండొచ్చని ఇంకొందరు భావించారు, అయితే మరికొందరు అది కొన్ని నెలలుగా నీటిలో ఉందని చెప్పారు.ఇది 2019, మేలో లాంచ్ చేసిన PSLV-CA C46 అనే నిర్దిష్ట మిషన్‌లోని పార్ట్ కావచ్చనే ప్రచారం కూడా సాగుతోంది.ప్రతి ఒక్కరూ వస్తువు ఎక్కడ నుండి వచ్చిందో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.సో, ఈ మిస్టరీ త్వరలోనే వీడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube