ఓ సరికొత్త రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ..

భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ( Virat kohli) ఓ సరికొత్త రికార్డుకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.ప్రస్తుతం క్రికెట్లో యాక్టివ్ గా ఉన్న ప్లేయర్లలో ఎవరు సాధించని ఘనత విరాట్ కోహ్లీ సాధించనున్నాడు.

 Virat Kohli Is The New Record Holder, Virat Kohli, Ms Dhoni, Sachin,rahul Dravid-TeluguStop.com

వెస్టిండీస్ ( West indies ) పర్యటనలో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 20 నుంచి ప్రారంభం అవ్వనుంది.ఆ మ్యాచ్ తోనే ఓ అరుదైన రికార్డ్ కోహ్లీ స్వంతం అవ్వనుంది.

విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 499 అంతర్జాతీయ ( International) మ్యాచులు ఆడాడు.జూలై 20 న జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ 500 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఏకైక చురుకైన క్రికెటర్ గా నిలువనున్నాడు.

రెండో టెస్ట్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ భారత క్రికెటర్ల ఎలైట్ క్లబ్లో చేరనున్నాడు.అయితే భారత్ (India ) తరపున 500 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఆటగాళ్లు కేవలం ముగ్గురే ఉన్నారు.

వాళ్లు ఎవరో చూద్దాం.

Telugu Cricket, Msdhoni, Rahul Dravid, Virat Kohli-Sports News క్రీడ�

సచిన్ టెండుల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచులు ఆడి ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.తరువాత మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) 535 అంతర్జాతీయ మ్యాచులు ఆడి ఆ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.ప్రస్తుత భారత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ 504 మ్యాచులు ఆడి ఆ జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచులు ఆడిన నాలుగవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలువనున్నాడు.

Telugu Cricket, Msdhoni, Rahul Dravid, Virat Kohli-Sports News క్రీడ�

అంతర్జాతీయ పరంగా చూసుకుంటే.ప్రపంచ టాప్-10 బ్యాట్స్ మెన్ లలో విరాట్ కోహ్లీ చేరనున్నాడు.భారత్ తో పాటు తమ జట్టు కోసం 500 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ప్రపంచంలోని టాప్-10 ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరనున్నాడు.

అయితే క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ తన 500వ మ్యాచ్లో సెంచరీ( Centuries ) తో రికార్డ్ సృష్టించాలని కోరుకుంటున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube