కలుపు మొక్కలను తీసేందుకు సరికొత్తగా లేజర్ గన్..!

వ్యవసాయంలో( Agriculture ) రోజు రోజుకు కూలీల కొరత అనేది పెరిగిపోతూ ఉంది.ముఖ్యంగా కలుపు తీసేందుకు కూలీలు దొరకక( Labor Shortage ) రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Laser Gun To Burn Weed From The Crop Details, Laser Gun ,burn Weed , Crop, Weed-TeluguStop.com

సకాలంలో కలుపు మొక్కలను( Weeds ) తొలగించకుంటే పంట మొక్కలతో సమానంగా ఎదిగి తీవ్ర నష్టం కలిగిస్తాయి.చాలామంది ఈ కలుపు సమస్యను అధిగమించడం కోసం ఎన్నో రకాల రసాయన పిచికారి మందులను ఉపయోగించి పెట్టుబడి భారం విపరీతంగా పెంచుకుంటున్నారు.

అయితే ఒక గంటకు రెండు లక్షల కలుపు మొక్కలను తీసే లేజర్ గన్ అందుబాటులోకి వచ్చింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లేజర్ కిరణాల ద్వారా కలుపును ఎలా నివారించాలో చూద్దాం.

ఈ లేజర్ గన్( Laser Gun ) ఒక గంటలో రెండు లక్షల కలుపు మొక్కలను కాల్చేస్తుంది.ఈ పరికరం ద్వారా పంట మొక్కలకు ఎటువంటి హాని ఉండదు.కలుపు మొక్క ఒక మిల్లీ మీటర్ కంటే తక్కువగా ఉన్నా కూడా కలుపు మొక్కలను నిర్మూలిస్తుంది.ఈ పరికరం ప్రత్యేకత ఏమిటంటే పగలు రాత్రి అనే తేడా లేకుండా రోజులో ఉండే 24 గంటలు పనిచేస్తుంది.

ఈ పరికరం వ్యవసాయ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.శారీరక శ్రమతో పాటు పంట పెట్టుబడి కూడా తగ్గిస్తుంది.కేవలం లేజర్ కిరణాలతో కలుపు మొక్కలను కాల్చి వేయడం వల్ల పంటలో నాణ్యత పెరుగుతుంది.ఈ లేజర్ గన్ అన్ని కాలాలలో అన్ని రకాల పంటలలో ఉపయోగించుకోవచ్చు.

త్వరలోనే ఈ లేజర్ గన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.ఈ పరికరం అందుబాటులోకి వస్తే రసాయన పిచికారి మందుల వాడకం చాలావరకు తగ్గే అవకాశం ఉంది.

ఇక రైతులకు వ్యవసాయ కూలీల కొరత సమస్య ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube