నరసరావుపేటను అరాచకాలకు అడ్డాగా మార్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.నేరస్తులను వదిలేసి నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
దాడికి పాల్పడింది ఎవరో నరసరావుపేట ప్రజలు అందరికీ తెలుసని చెప్పారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఆగడాలు డీజీపీకి కనిపించడం లేదా అని నిలదీశారు.
ఎమ్మెల్యేని వదిలేసి బాధితులపై హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు.డీజీపీ దృష్టిలో బాధితులే నిందితులా అని ప్రశ్నించారు.







