ఢిల్లీ సమీపంలోని ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్( Taj Mahal )ను సందర్శించేందుకు డైలీ వేల మంది పర్యాటకులు వస్తుంటారు.అయితే సోమవారం తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడికి చేదు అనుభవం ఎదురయింది.
ఆగ్రాలోని పేట స్వీట్ షాప్( Petha Shop )లో అతడిని పట్టుకుని కొందరు స్థానికులు విచక్షణారహితంగా కొట్టారు.ఈ ఘటన షాప్‌లోని సీసీటీవీలో రికార్డు అయింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సదరు టూరిస్ట్ కారు ప్రమాదవశాత్తూ ఒకరిని తాకుతూ వెళ్ళిందట.
దాంతో ఆ టూరిస్ట్‌ను కారు తగిలిన వ్యక్తితో సహా కొందరు స్థానికులు వెంబడించినట్లు వీడియోలో కనిపించింది.
ఆ వ్యక్తులు తాజ్‌గంజ్ ప్రాంతం బసై చౌకి ( Basai Chowki )లో పర్యాటకుడిని పట్టుకున్నారు.తరువాత స్వీట్ షాప్‌లోకి లాక్కెళ్లి కర్రలు, రాడ్లతో కొట్టడం ప్రారంభించారు.పర్యాటకుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించడాన్ని వీడియోలో చూడవచ్చు, కానీ దాడి చేసేవారు ఎక్కువమంది ఉండటంతో సదరు టూరిస్ట్( Tourist ) నిస్సహాయక స్థితిలో ఉండిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టూరిస్ట్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అభియోగాలు మోపారు.పర్యాటకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు.
ఈ సంఘటన భారతదేశంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.పర్యాటకుల భద్రత( Tourists Safety )ను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్స్ వినిపిస్తున్నారు.ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మరోసారి అలాంటి ఘటన జరగకుండా చూస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం( Uttarpradesh Government ) హామీ ఇచ్చింది.
భారతదేశంలో పర్యాటకులు ఎదుర్కొనే ప్రమాదాలను ఈ ఘటన హైలెట్ చేస్తుంది.భారతదేశం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్నప్పటికీ, ప్రమాదాల గురించి తెలుసుకోవడం, సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.