రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పై అనుచిత వాక్యలు చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ దిష్టి బోమ్మను దహానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా మానకోండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ లో అగ్రనేత రాహుల్ గాంధీ ని అనుచితంగా మాట్లాడడమే కాకుండా వ్యవసాయంపై కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదని మాట్లాడం జరిగింది.
రాహుల్ గాంధీ క్లబ్ లు, పబ్ లు తిరుగుతారని, ఆయనకు వడ్లు తెలియవు, ఎడ్లు తెలియవు అంటూ హేళన చేసే విధంగా మాట్లాడారు.ఈ దేశంలో హరిత విప్లవం, క్షీర విప్లవం తెచ్చి అనేక సాగు నీటి ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు.
నేడు ప్రపంచంలోనే 250 దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది, జలాశయాలు ఆధునిక దేవాలయాలుగా భావించి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి అనేక ప్రాజెక్టులు నిర్మించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంది దేశ వ్యాప్తంగా ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసింది కాంగ్రెస్ పార్టీనే దేశంలో మొదటిసారిగా ఆంద్ర ప్రదేశ్ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీని అమెరికాలో హోటల్లో పని చేసిన కేటీఆర్ విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.
క్లబ్ లో పబ్ లో డ్రగ్స్ వ్యాపారం చేసుకొని బతికే కేటీఆర్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించడం ఆయన స్థాయికి తగదని అని హెచ్చారించారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షడు పసుల వెంకటి, అంతగరి బాలపోచయ్య, మైనర్టీ అధ్యక్షుడు జమాల్ , యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏర్రోజు సంతోష్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షలు మామిడి నరేష్ , గ్రామ శాఖల అధ్యక్షులు దూస రాజు, బడుగు లింగం,వడ్డే కోటేశ్వర్, రాజేందర్ రెడ్డి, బద్దం హన్మంత రెడ్డి, రమణ రెడ్డి, న్యాత బాబు తదితరులు పాల్గొన్నారు.