1.తెలంగాణలో మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు మొదలైంది.రాష్ట్రవ్యాప్తంగా బీటెక్ కు సంబంధించి మొదటి విడతలో 70,665 ఇంజనీరింగ్ సీట్లను కేటాయించారు.
2.తెలంగాణ గవర్నర్ కామెంట్స్

ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున భోనాలకు పిలుపు రాలేదని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అన్నారు.అందుకే రాజ్ భవన్ లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
3.శ్రీ వాణీ ట్రస్ట్ పై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు
శ్రీ వాణి ట్రస్ట్ పై కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని ఈవో ధర్మ రెడ్డి తెలిపారు.
4.ఆర్జీవి ట్వీట్ పై పోలీసులకు ఫిర్యాదు

వాలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
5.వైసిపి ప్రభుత్వంపై దేవినేని ఉమా విమర్శలు
అమరావతి రైతుల కన్నీటి కడలిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని మాజీ మంత్రి టిడిపి నేత దేవినేని ఉమ మహేశ్వరరావు విమర్శించారు.
6.అవయవ దానాలపై ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి

అవయవ దానాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా నూతన విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని పేర్కొన్నారు.
7.తప్పుడు ఫిర్యాదులపై హైకోర్టులో మాజీ జడ్జి పిటిషన్
బలవంతపు ఉద్యోగ విరమణ కు దారి తీసేలా తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యవహారంపై సిబిఐ డైరెక్టర్ జరిపించాలని కోరుతూ మాజీ జడ్జి రంజన్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
8.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు

భద్రతా పనుల దృష్ట్యా విజయవాడ డివిజన్ పరిధిలో ఈనెల 16 నుంచి 23 వరకు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్ళను దారి మళ్ళిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
9.అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా
ఉత్తరప్రదేశ్ లోని మౌ జిల్లా గోసి నియోజకవర్గ ఎమ్మెల్యే దారాసింగ్ చౌహన్ ఆ రాష్ట్ర అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
10.రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.రుణమాఫీ , కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపునిచ్చారు.
11.కేటీఆర్ కు అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం
అంతర్జాతీయ ఐటి ఆవిష్కరణల సంస్థ సెప్టెంబర్ 13న జర్మనీ రాజధాని లో ప్రపంచ వాణిజ్య ఆవిష్కరణల విధానంపై నిర్వహించే వార్షిక శిఖరాగ్ర సదస్సులు పాల్గొనాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించింది.
12.భూగర్భ జల శాఖ పోస్టుల హాల్ టికెట్లు

భూగర్భ జల శాఖలో వివిధ నాన్ గెజిటెడ్ పోస్టులకు గాను ఈనెల 21 తేదీల్లో నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు టిఎస్పిఎస్సి తెలిపింది.
13.యూఎస్ పీసీ దశల వారి పోరాటం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్య ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి దశల వారి పోరాటం నిర్వహిస్తామని స్టీరింగ్ కమిటీ వెల్లడించింది.
14.శ్రీరామ సాగర్ ప్రాజెక్టులో పెరిగిన ఇన్ ఫ్లో

శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ లో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు 6.622 టీ ఎం సి ల నీరు వచ్చింది.
15.ఏపీ ప్రభుత్వంపై పురందరేశ్వe6ర విమర్శలు
కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరి విమర్శించారు.
16.ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల అదనపు కోట విడుదల చేస్తాం

తిరుమల శ్రీవారి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల అదనపు కోటాను విడుదల చేస్తామని టీటీడీ ఈవో ధర్మ రెడ్డి తెలిపారు.
17.20న జనసేనలో చేరుతా : పంచకర్ల
ఈనెల 20న జనసేనలో చేరుతున్నానని వైసీపీ విశాఖ మాజీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు.
18.తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
19.ఎన్డీఏ మిత్రపక్షుల సమావేశానికి జనసేనకు ఆహ్వానం
బిజెపి సారధ్యంలోని ని ఎన్డీఏ సమావేశంలో పాల్గొనాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది .ఈనెల 18న ఢిల్లీలో ఈ సమావేశం జరుగుతుంది.
20.పవన్ కళ్యాణ్ పై రోజా కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఉంటే.జగన్ కు సైన్యం ఉందని ఏపీ మంత్రి
.






