కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్‘ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు రెండు పాటలు విడుదల అయ్యాయి.
టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రాగా, పాటలకు మిశ్రమ స్పందన లభించింది.ఇప్పుడు అభిమానులందరూ ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
వచ్చే శనివారం,ఎం కానీ, లేదా ఈ నెల 22 వ తారీఖున జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ట్రైలర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.ఈ ట్రైలర్ తో చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోతాయని, పాటల ద్వారా వచ్చిన నెగటివిటీ మొత్తం మాయం అవుతుందని అంటున్నారు.div class=”middlecontentimg”>

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా( Social media ) లో నిన్నటి నుండి జరుగుతున్న ఒక ప్రచారం ఇప్పుడు అభిమానులను కలవరపెడుతుంది.అదేమిటి అంటే ఈ సినిమాని వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని, దీనిపై ఇప్పటికే చర్చలు జరిగాయని అంటున్నారు.ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ఇంకా జరుగుతుంది, రీ రికార్డింగ్ కూడా పూర్తి అవ్వలేదు, దానికి తోడు పవన్ కళ్యాణ్ తన పాత్రకి సంబంధించి డబ్బింగ్ ని ఇప్పటి వరకు పూర్తి చెయ్యలేదు.ఇలా చాలా పెండింగ్ వర్క్ ఉండడం తో హడావడి గా సినిమాని విడుదల చేసే బదులు, కాస్త మంచి ఔట్పుట్ తో , క్వాలిటీ ని మైంటైన్ చేసి విడుదల చేస్తే బెటర్ కదా అనే ఆలోచనలో ఉన్నారట.
ఇప్పటికీ దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ నెల 22 లోపు డబ్బింగ్ పూర్తి చేస్తే ముందు అనుకున్న సమయానికే విడుదల చేసే ఛాన్స్ ఉంటుంది.div class=”middlecontentimg”>

సముద్రఖని( Samuthirakani ) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి ,త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించగా, థమన్ సంగీతం అందించాడు.తమిళం లో మంచి రివ్యూస్ ని దక్కించుకున్న జీ తెలుగు ఒరిజినల్ మూవీ ‘వినోదయ్యా చిత్తం’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఇందులో కేతిక శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు.
ఇక ఈ వారం లో ఒకవేళ ట్రైలర్ విడుదల కాకపోతే శ్లోకం సాంగ్ ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.ఇప్పటకి వరకు విడుదలైన రెండు పాటలకు అంతంత మాత్రం రెస్పాన్స్ వచ్చింది,కనీసం ఈ పాట అయినా అభిమానులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.







