విజయ్ - సమంత ఖుషి షూట్ పూర్తి.. గ్రాండ్ గా ముగించిన టీమ్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే గీతా గోవిందం తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అయితే ఈయనకు పడలేదు అనే చెప్పాలి.

 It’s A Wrap For Vijay Deverakonda And Samantha’s Kushi, Vijay Devarakonda,-TeluguStop.com

అందుకే లైగర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది.అందుకే ఈయన నెక్స్ట్ చేస్తున్న సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

మరి లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ”ఖుషి” ( Khushi ).ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్ తో పాటు సమంత ఖాతాలో కూడా ప్లాప్స్ ఉండడంతో ఈ జంట హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఖుషి వంటి ఆకట్టుకునే లవ్ స్టోరీతో ఇద్దరు కలిసి హిట్ అందుకోవాలని చూస్తున్నారు.

శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.అందులోనే శివ నిర్వాణ మనసులకు హత్తుకునే లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో ఈయన ముందు ఉంటాడు.

ఇక ఈ సినిమా షూట్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.ఖుషి షూట్ పూర్తి అవ్వడంతో టీమ్ అంతా కేక్ కట్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసారు.

ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు ప్రజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని సెప్టెంబర్ 1న కలుద్దాం అని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube