అక్క తమ్ముడుగా ఎన్టీఆర్ కొడుకు సితార... అభిమానులకు పండగే?

సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సాధారణం.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల పిల్లలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

 Jr Ntr Son Abhay Ram First Movie Sitara Details, Sitara,ntr,abhy Ram, , Rajamoul-TeluguStop.com

ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్నటువంటి మహేష్ బాబు, అల్లు అర్జున్ పిల్లలు సినిమాలలో బాల నటులుగా మెప్పించిన విషయం మనకు తెలిసిందే.అలాగే సుధీర్ బాబు కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కుమారుడు కూడా త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.దీంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ కి ఇద్దరు కుమారులు అన్న విషయం మనకు తెలిసిందే.వీరిలో పెద్ద కుమారుడు అభయ్ రామ్ (Abhy Ram) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.అలాగే మహేష్ బాబు గారాల పట్టి సితార (Sitara) కూడా ఈ సినిమాలో భాగం కాబోతుందని సమాచారం.ఈ సినిమాలు వీరిద్దరూ అక్క తమ్ముళ్లు పాత్రలో నటించబోతున్నారని తెలియడంతో మహేష్ బాబు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వీరిద్దరూ ఏ సినిమాలో నటించబోతున్నారు ఆ సినిమా డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.

Telugu Abhy Ram, Jrntr, Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Sitara-Movie

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు త్వరలోనే ఓ అడ్వెంచరస్ మూవీ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఇంట్రడక్షన్ పార్ట్ లో దాదాపు 15 నిమిషాల పాటు సితార అభయ్ రామ్ పాత్ర ఉండబోతుందని అందుకు వీరిద్దరిని రాజమౌళి సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.ఇలా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్నటువంటి సినిమా ద్వారా సితార అభయ్ రామ్ ఇద్దరు కూడా నటించబోతున్నారన్న విషయం తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Abhy Ram, Jrntr, Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Sitara-Movie

సితార ఇదివరకే సర్కారు వారి పాట సినిమాలో సందడి చేశారు.కానీ అభయ్ రామ్ మాత్రం మొదటిసారి వెండితెరపై సందడి చేయబోతున్నారన్న విషయం ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.మరి వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాలి అంటే మేకర్స్ స్పందించాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube