సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ఈ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా నిర్మాత ఎంఎస్ రాజు( MS Raju ) ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
వర్షం, ఒక్కడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలన్నీ కూడా సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇలా నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తన కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయారు.
సుమంత్ అశ్విన్ ( Sumanth Aswin ) తూనీగ తూనీగ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ అనంతరం ఈయన చేసిన సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి.ఇక సుమంత్ అశ్విన్ మెగా డాటర్ నిహారిక (Niharika)హీరో హీరోయిన్లుగా హ్యాపీ వెడ్డింగ్ ( Happy Wedding ) అనే సినిమాలో కూడా నటించారు.అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ మెగా డాటర్ నిహారిక గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.నిహారిక షూటింగ్ లొకేషన్లో కనక ఉంది అంటే ప్రతి ఒక్కరు యాక్టివ్ గా ఉంటారని తెలిపారు.

ఆమె అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు.స్టార్ డాటర్ అనే ఈగో ఏ మాత్రం చూపించదు.చాలా సింపుల్ గా ఉండి అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు.ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నిహారిక పుట్టినరోజు( Birthday ) వచ్చింది.దీంతో చెన్నై నుంచి తన కజిన్ వస్తుండగా తనతో చెన్నై నుంచి నిహారిక కోసం ప్రత్యేకంగా ఒక కేక్ తెప్పించి సెట్లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేశామని ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







