ఎన్నో ఏళ్ల గిరిజనుల కళ నెరవేర్చిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

గుంటుపల్లి చెరువు తండా లో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ కోటి రూపాయల వ్యయంతో బ్రిడ్జీ నిర్మాణం రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల కళను ఎట్టకేలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ నెరవేర్చారు.ఎల్లారెడ్డిపేట( Ellareddypet ) మండలం గుంటపల్లి చెరువు తండా లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , గ్రామ సర్పంచ్ మాలోత్ సునీత పుణ్యా నాయక్ భూమి పూజ చేశారు.

 State It Minister Ktr Has Fulfilled The Tribal Art Of Many Years , Minister Ktr-TeluguStop.com

మండల కేంద్రం నుండి గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీకి , గ్రామపంచాయతీ నుండి మరో 25 మంది నివాసముంటున్న గిరిజన తండాకు వెళ్లే మార్గం మధ్య బ్రిడ్జి గాని కల్వర్టు గాని లేక వర్షాకాలంలో గిరిజనులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల కళ నెరవేరింది.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక కోటి రూపాయలు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.అట్టి నిధులతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ,ఎఏం సి మాజీ చైర్మన్లు అందె సుభాష్ , గుల్లపల్లి నరసింహారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , బిఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు పుణ్యా నాయక్ గణేష్ జవహర్ జలపతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube