భూదాన్ భూముల ఆక్రమణలు సహించేది లేదు,కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ వి.పి గౌతమ్

ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణలు సహించేది లేదని, కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ( V.P.Gautham )ఒక ప్రకటనలో తెలిపారు.వెలుగుమట్ల లో సర్వే నెంబర్ 147, 148, 149 లలో భూదాన్ భూములు ఉన్నట్లు ఆయన అన్నారు.

 Encroachment Of Bhudan Lands Will Not Be Tolerated, Strict Action Will Be Taken-TeluguStop.com

ఒకరిద్దరు దళారులు అమాయక పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి, వారిని భూదాన్( Bhudan ), పరిసర పట్టా భూముల ఆక్రమణకు ఉసిగోల్పుతున్నట్లు, వారిని మోసం చేస్తున్నట్లు కలెక్టర్ అన్నారు.దళారులు ఒక్కొక్కరి నుండి రూ.40 వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు.ఖమ్మం నుండే కాక సూర్యాపేట, తల్లాడ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలచే భూ ఆక్రమణలు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శనివారం భూ ఆక్రమణ చేసి, 300 షెడ్లు వేయగా, అన్నింటిని కూల్చివేసినట్లు ఆయన తెలిపారు.ప్రజలెవ్వరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, భూ ఆక్రమణలపై కఠిన చర్యలు వుంటాయని, భూ ఆక్రమణదారులు, ప్రోత్సహించిన వారిపై భూ ఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పిడి యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube