టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోల రేసులో ఉన్న హీరోలలో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.రామ్ చరణ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ పేరు సంపాదించుకున్నారు.
చరణ్ కు కథల ఎంపికలో చిరంజీవి సైతం తన వంతు సహాయసహకారాలు అందించడంతో భారీగా విజయాలు దక్కుతున్నాయని సమాచారం అందుతోంది.అయితే తాజాగా చరణ్ ఒక సందర్భంలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
కొన్ని వారాల క్రితం తండ్రి అయిన రామ్ చరణ్ ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. క్లీంకారకు సంబంధించిన ఫోటోల కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అభిమానులకు క్లీంకార దర్శనం ఎప్పుడు ఉంటుందో చూడాల్సి ఉంది.
చిరంజీవి పుట్టినరోజు కానుకగా క్లీంకార ఫోటోలను విడుదల చేసే అవకాశం అయితే ఉందనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.

అయితే తాజాగా చరణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) లో భారీ ఎనర్జీ ఉంటుందని తారక్ కు ఉండే ఎనర్జీ నాకు కూడా ఉంటే బాగుంటుందని చరణ్ కామెంట్లు చేశారు.మహేష్ ( Mahesh )విషయానికి వస్తే మహేష్ బాబులో ఉన్న అందం నాకు కూడా ఉంటే బాగుంటుందని అనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
బన్నీ( Bunny ) ఎవరేం కామెంట్ చేసినా స్పోర్టివ్ గా తీసుకుంటాడని చరణ్ తెలిపారు.

అయితే చరణ్ అభిమానులు మాత్రం చరణ్ లో కూడా ఈ గుణాలు అన్నీ ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.రామ్ చరణ్ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.చరణ్ ప్రస్తుతం పాన్ వరల్డ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాతో బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమాతో బిజీగా ఉన్నారు.







