దుబాయ్( Dubai) నగరం యూఏఈ లోని ఏడు నగరాలలో కెల్లా అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం మాత్రమే కాదు అద్భుతమైన నిర్మాణ కౌశల్యానికి మారుపేరు అని అందరికీ తెలిసిందే.దుబాయ్ నగరం అంటే గుర్తుకు వచ్చేది బుర్జ్ ఖలీఫా తో పాటు ఆకాశాన్ని అంటే అద్భుతమైన కట్టడాలు, అక్కడ మనుషుల విలాసవంతమైన జీవితం.
అటువంటి నగరంలో వ్యవసాయం అనే మాటకు చోటు అనేదే లేదు.ఎందుకంటే అదంతా ఎడారి ప్రాంతం.
ఇవన్నీ పాత సంగతులు.ప్రస్తుతం దుబాయిలో రూఫ్ టాప్ సేద్యం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.
నగరంలోని కాంక్రీట్ భవనాలన్నీ ఆకుపచ్చని సోబగులు అద్దుకొంటోంది.దుబాయ్ నగరంలోని ప్రజలంతా పచ్చదనం, పర్యావరణం పై దృష్టి పెట్టారు.
భవనాల పైకప్పులపై ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలను పండిస్తున్నారు.
ఈ రూఫ్ టాప్ సేద్యం( Rooftop irrigation )తో వీలైనంతవరకు ఆహార భద్రతకు లోటు ఉండదు.
ఎందుకంటే యూఏఈ లో ఎంతో తీవ్రమైన ఎడారి వాతావరణం ఉండడంతో ఆహారం మొత్తాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది.ఈ సమస్యను అధిగమించడం కోసం ఇంటి పైనే ఆహారాన్ని పండించుకునే సదుపాయాన్ని కల్పించే భవన నిర్మాణ ప్రాజెక్టుల కోసం యూఏఈ దృష్టి సారించింది.
ఇలా చేయడం వల్ల కాంక్రీట్ భవనాల నుండి వచ్చే వేడి తగ్గడంతో పాటు ఇంటి పైనే ఆహార పంటలు ఉత్పత్తి అవుతాయి.నగరవాసులకు విశ్రాంతి ఇవ్వడంలో మిద్దె తోటల వాతావరణం ఎంతో తోడ్పడుతుంది.

ప్రస్తుతం దుబాయిలో ప్రత్యేక నిర్మాణాల ద్వారా పంటలు సాగు చేసేందుకు హైడ్రోపోనిక్స్, ఏరోపొనిక్స్ ఆంటీ అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలను ఉపయోగించి ఆకుకూరలు, కూరగాయలు, తులసి, కలబంద వంటి ఔషధ మొక్కలు ఇస్తున్నారు.

సాంప్రదాయక వ్యవసాయ పద్ధతుల కంటే ఈ పద్ధతులతో వ్యవసాయం చేస్తే అతి తక్కువ నీరు ఖర్చు అవుతుంది.అంతేకాకుండా మిద్దె తోటలు కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్ ( Oxygen )ను విడుదల చేస్తాయి.దీంతో గాలిలో నాణ్యత మెరుగు అవుతుంది.
ఈ విధానం కేవలం రెస్టెన్షియల్ భవనాలకు మాత్రమే పరిమితం కాలేదు.ఉండే అన్ని రకాల భవనాల పైకప్పులపై పంటల సాగు చేయడంపై ఇది సానుకూల ప్రభావాన్ని కలిగిస్తోంది.
యూఏఈ ప్రభుత్వం కూడా ఈ సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది.







