వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ).ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఈపేరే వినిపిస్తుంది.
మొన్నటివరకు టిక్ టాక్ లు, వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన వైష్ణవి చైతన్య అతి తక్కువ టైంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది.వైష్ణవి సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో మరింత ఫేమస్ అయ్యింది.
షన్ను తో కలిసి నటించిన ఈ సిరీస్ వైష్ణవి చైతన్య కి మంచి గుర్తింపు తెచ్చింది.ఇండస్ట్రీలో ముందు అల్లుఅర్జున్( Alluarjun ) చెల్లలి పాత్రలో నటించిన వైష్ణవి, ఆ తరువాత అజిత్ సినిమాలో కూడా కనిపించింది.
ఇప్పుడు హీరోయిన్ గానే ఒక సినిమా చేసి అందరి కళ్ళు తనవైపే చూసేలా చేసింది వైష్ణవి.
![Telugu Alluarjun, Baby, Sai Rajesh, Viraj-Telugu Stop Exclusive Top Stories Telugu Alluarjun, Baby, Sai Rajesh, Viraj-Telugu Stop Exclusive Top Stories](https://telugustop.com/wp-content/uploads/2023/07/vaishnavi-chaitanya-super-succes-as-a-heroinea.jpg)
విజయ్ దేవరకొండ తమ్ముడు నటించిన బేబీ( Baby ) సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.చేసిన మొదటి సినిమాతోనే అందరితో ప్రశంసలు అందుకుంటోంది.బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య జీవించేసింది.
ఈ సినిమా ముగ్గురి చుట్టే తిరుగుతున్నా అందరి కళ్ళు వైష్ణవి చైతన్య మీదే ఉండేలా తన నటనతో అదరగొట్టింది.కోపం, ప్రేమ, ద్వేషం, ఎమోషనల్ ఇలా అన్ని రకరకాల వేరియేషన్స్ పలికించింది.
ఇప్పటికే బేబీ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటికే చాలా మంది ఈ సినిమా గురించి రివ్యూలు చెప్పేస్తున్నారు.
అయితే ఈ సినిమా వైష్ణవి కెరీర్ లో గుర్తుండిపోతుంది అంటున్నారు.
![Telugu Alluarjun, Baby, Sai Rajesh, Viraj-Telugu Stop Exclusive Top Stories Telugu Alluarjun, Baby, Sai Rajesh, Viraj-Telugu Stop Exclusive Top Stories](https://telugustop.com/wp-content/uploads/2023/07/vaishnavi-chaitanya-super-succes-as-a-heroineb.jpg)
ఈ రోజుల్లో ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి, ఎందుకు ఎక్కువ మంది విడిపోతున్నారు అనే కాన్సెప్ట్స్ తో బేబీ సినిమా తీయగా ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి.ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్( Anand Devarakonda, Viraj ), వైష్ణవి చైతన్య వారి పాత్రలకి ప్రాణం పోశారు.ముఖ్యంగా వైష్ణవి తన మొదటి సినిమాతో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు హీరోయిన్లు కూడా మంచి క్యారెక్టర్ ఇస్తే రాణించగల సత్తా ఉందని వైష్ణవి చైతన్య నిరూపించిందని అంటున్నారు.నిజానికి ప్రేమకథను ఈ రోజుల్లో ఆకట్టుకునేలా తీయడం చాల కష్టమైన పని కానీ బేబీ సినిమా కు పని చేసిన దర్శకుడు మరియు రైటర్ సాయి రాజేష్ కొంతమేరకు సక్సెస్ అయినట్టే.