స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని మాట్లాడుకోవాలి.బాహుబలి ముందు ప్రభాస్ స్టార్ హీరో అయినా బాహుబలి తర్వాత ప్రభాస్( Prabhas ) కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది.
ప్రభాస్ సాధారణ సినిమాలో నటించినా 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం ప్రభాస్ రేంజ్, క్రేజ్ కు సాక్ష్యమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ నటించిన సలార్( Salaar ) ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 200 కోట్ల రూపాయలు పలికాయని సమాచారం అందుతోంది.
ఒక విధంగా ఇది రికార్డ్ కాగా సినిమా హక్కులు ఈ స్థాయిలో పలకడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారని సమాచారం అందుతోంది.సలార్ సినిమాలో ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
సలార్ సినిమాలో ఆద్య అనే జర్నలిస్ట్ రోల్ లో శృతి హాసన్( Shruti Haasan ) నటిస్తుండటం గమనార్హం.సలార్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో సలార్ రెండోభాగంపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సలార్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సలార్ సినిమా బాలీవుడ్ హక్కులకు కూడా భారీ స్థాయిలో డిమాండ్ నెలకొందని భోగట్టా.
సలార్ మూవీ ప్రభాస్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులను సైతం మెప్పిస్తుందని సమాచారం.సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ చాలా ఆశలు పెట్టుకున్నారు.సలార్ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.స్టార్ హీరో ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ రేంజ్ లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలు కూడా అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం.