సినీ ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.ఆ సెంటిమెంట్ వారి కెరీర్ లో కచ్చితంగా వర్క్ అవుతుంటాయి.
ఒక్కసారి ఆ సెంటిమెంట్ వర్క్ అయితే హీరోలు, డైరెక్టర్లు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతుంటారు.ఇప్పుడు ఇలాంటి ఒక సెంటిమెంట్ ఎన్టిఆర్ ( NTR )కి రిపీట్ కాబోతుంది.
ఈ వార్త విన్న నందమూరి అభిమానులు అందరు ఇప్పటి నుంచే పండగ చేసుకుంటున్నారు.దీంతో RRR తరువాత ఎన్టిఆర్ చేస్తున్న దేవర సినిమా( Devara movie ) కూడా ఎన్టిఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అంటున్నారు.
ఇంతకి ఆ సెంటిమెంట్ ఏంటి, ఎందుకు పక్కాగా హిట్ అవుతుందో ఇప్పుడు చూసేద్దాం.
ఎన్టిఆర్ కూడా ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.ఇప్పటికే ఎన్టిఆర్ ఎంతో మంది దర్శకులతో పనిచేసారు.అయితే ప్లాప్ లో ఉన్న డైరెక్టర్ తో ఎన్టిఆర్ సినిమా చేస్తే ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.
బాగా గుర్తుచేసుకోండి.ఎన్టిఆర్ కెరీర్ లో ఇప్పటికి ఇలా 5 సార్లు రిపీట్ అయ్యింది.
ఇప్పుడు ఈ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.వంశీ పైడి పల్లి మొదట ప్రభాస్ తో మున్నా సినిమా చేయగా అది అట్టర్ ఫ్లాప్ అయింది.
ఆ తరువాత ఆ డైరెక్టర్ కి ఎన్టిఆర్ ఛాన్స్ ఇచ్చాడు.వంశీ పైడి పల్లి ఆ తరువాత ఎన్టిఆర్ తో బృందావనం </em( Brindavanam )అనే ఒక క్లాసిక్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఎన్టిఆర్ – పూరి జగన్నాధ్ కెరీర్ లో మర్చిపోలేని సినిమా టెంపర్ ( Temper )అప్పటివరకు ప్లాప్స్ లో ఉన్న పూరికి ఈ సినిమా మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.ఆ తరువాత ఈ ఇద్దరి కెరీర్లు ఊపందుకున్నాయి.పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కెరీర్ లో అజ్ఞాతవాసి డిసాస్టర్ అయ్యింది.ఆ తరువాత త్రివిక్రమ్ ఎన్టిఆర్ తో అరవింద సామెత సినిమా చేసారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.దీంతో ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని ఫాలో అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఆచార్య ప్లాప్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ దర్షుడితోనే ఎన్టిఆర్ దేవర సినిమా చేస్తున్నారు.ఇదే సెంటిమెంట్ వర్క్ అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.
ఇప్పటికే దర్శకుడు మాట్లాడుతూ నా కెరీర్ లో నేను బెస్ట్ ఇస్తున్న అని చెప్పగానే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.చూడాలి మరి ఏం జరుగుతుందో.