ఈ అమ్మడికి సినిమాలు లేకున్నా ఓపెనింగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి

ఊహలు గుసగుసలాడే ( Oohalu Gusagusalade )సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా.( Raashii Khanna ) ఈ అమ్మడి యొక్క అందం మొదటి సినిమా తోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

 Tollywood Heroine Rashi Kanna Busy With Shops Openings , Oohalu Gusagusalade , R-TeluguStop.com

అంతే కాకుండా మొదటి సినిమా లోనే ఈమెకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది.ఆ అవకాశం ను సద్వినియోగం చేసుకుంది.

అక్కడ నుండి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాలేదు కానీ టైర్ 2 హీరోల తో ఈ అమ్మడు దాదాపు అయిదు సంవత్సరాల పాటు బిజీ హీరోయిన్ గా సినిమా లు చేసింది.

Telugu Kollywood, Mangalya Mall, Naga Shaurya, Raashii Khanna, Telugu, Tollywood

తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం లో కూడా ఈమె వరుసగా సినిమా లు చేసి ఒకానొక సమయంలో పలు సినిమా లను కూడా డేట్లు కేటాయించలేక పోవడం వల్ల వదిలేసిన సందర్బాలు ఉన్నాయి.తెలుగు లో రాణించాలంటే బొద్దుగా కంటే నాజూకు గా ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా బరువు తగ్గి నాజూకు గా మారిన విషయం తెల్సిందే.అన్ని ప్రయత్నాలు చేసినా కూడా పాపం స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాలేదు.ఎన్టీఆర్ ( NTR )కు జోడీగా నటించినా ఆ తర్వాత మరోస్టార్‌ హీరో ఎవరు కూడా ఈమెను పట్టించుకోలేదు.

Telugu Kollywood, Mangalya Mall, Naga Shaurya, Raashii Khanna, Telugu, Tollywood

అయినా కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వెళ్తోంది.ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు లో ఆఫర్లు దక్కించుకోవడం లో విఫలం అవుతుంది.ఆఫర్లు లేకున్నా రాశి ఖన్నా బిజీగానే ఉంటుంది.మోడలింగ్ లేదంటే సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో సంపాదిస్తూనే ఉంది.చివరకు వారంలో కనీసం ఏదో ఒక ఓపెనింగ్ కు ఈమె వెళ్తూనే ఉంది.తాజాగా మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.

మొత్తానికి రాశి ఖన్నా హీరోయిన్ గా బిజీ గా లేకున్నా కూడా ఇలా అయినా అంతో ఇంతో సంపాదిస్తూ జనాల్లో ఉంటుంది.ఇదే కొనసాగితే ముందు ముందు మళ్లీ నటిగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube