ఐసీసీ కొత్త రూల్స్ తో బీసీసీఐకు కాసుల పంట.. ఐసీసీ రెవెన్యూలో బీసీసీఐ వాటా 38.4శాతం..!

అంతర్జాతీయ క్రికెట్ మండలి( ICC ) తాజాగా జరిగిన తమ బోర్డు మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.కొత్త రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ కు ఆమోదం తెలిపింది.

 Icc Huge Revenue Share For Bcci Details, Icc , Icc Revenue Share ,bcci, Ipl , In-TeluguStop.com

దీంతో ఐసీసీ తో పాటు బీసీసీఐకు( BCCI ) కూడా భారీగా ఆదాయం రానుంది.బీసీసీఐ ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే.

ఇక బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్( IPL ) మ్యాచ్లకు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలోనే ఐసీసీ రెవెన్యూలో బీసీసీఐకి దాదాపుగా 38.4% వాటా దక్కనుంది.

ఇంత షేర్ ప్రపంచంలో ఉండే మరే దేశానికి దక్కలేదు.ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)కు ఐసీసీ రెవెన్యూలో 6.85% షేర్ దక్కింది.క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు ఐసీసీ రెవెన్యూలో 6.25% షేర్ లభించింది.ఇతర దేశాల క్రికెట్ బోర్డు లతో పోల్చుకుంటే బీసీసీఐకు ఎన్నో రెట్లు అధిక ఆదాయం రానుంది.ఈ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ వచ్చే నాలుగేళ్ల పాటు అమలులో ఉంటుంది అని ఐసీసీ తెలిపింది.

Telugu Bcci, Icc Share, India Cricket, Share-Sports News క్రీడలు

ఈ నిర్ణయంతో పాటు ఐసీసీ మరొక కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ కు పాపులారిటీ భారీగా పెరుగుతూ పోతోంది.ఇలా జరిగితే కొన్నేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు ఆదరణ తగ్గే అవకాశం ఉంది.అందుకే అంతర్జాతీయ క్రికెట్ ను కాపాడుకోవడం కోసం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్( Franchise Cricket League ) ఏదైనా సరే.ఒక టీంలో నలుగురు విదేశీ ప్లేయర్లు, ఏడుగురు స్వదేశీ ప్లేయర్లు ఉండాలని తేల్చి చెప్పేసింది.

Telugu Bcci, Icc Share, India Cricket, Share-Sports News క్రీడలు

ఇటీవలే అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ లీగ్ లో ఒక్కో టీంలో ఆరుగురు విదేశీ ప్లేయర్లను ఆడించేందుకు అనుమతించారు.ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ క్రికెట్ కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఐసీసీ భావించింది.

అంతేకాదు ఇలా ఏయే దేశ ఆటగాలను ఆడిస్తున్నారో ఆయా దేశ క్రికెట్ బోర్డులకు ఆ లీగ్లు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఐసీసీ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube