నందమూరి తారక రత్న(Taraka Ratna) మరణించి దాదాపు 6 నెలలు అవుతున్నప్పటికీ ఇంకా తన భార్య అలేఖ్యరెడ్డి (Alekhya Reddy) తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారని చెప్పాలి.ఫిబ్రవరి 18వ తేదీ తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.
ఈ విధంగా తారకరత్న మరణించినప్పటికీ అలేఖ్య మాత్రం తన భర్త జ్ఞాపకాలనుంచి బయటపడలేదు.తరచు తారకరత్నకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుంటూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్త అంటే తనకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తున్నారు.
ఇక భర్త మరణం తర్వాత ముగ్గురు పిల్లల భారం మొత్తం అలేఖ్య రెడ్డి మోస్తూ తన భర్త జ్ఞాపకాలతో కాలం వెల్లదీస్తున్నారు.ఇక ఎప్పటికప్పుడు తారకరత్నకు సంబంధించిన విషయాలను తన పిల్లలకు సంబంధించిన విషయాలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా తన కుమారుడు తనయ్ రామ్(Tanay Ram) ఫోటోతో పాటు తారకరత్న ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు(Badradri Ramudu) సినిమాలోని లుక్ ను తన కుమారుడు తనయ్ రామ్ తో పోలుస్తూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఫోటో షేర్ చేశారు.ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె లైక్ ఫాదర్ లైక్ సన్ అంటూ కామెంట్ చేశారు.దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసినటువంటి ఎంతో మంది నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు.అచ్చం ఈ ఫోటోలలో తనయ్ తారకరత్న మాదిరిగానే ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.