ఇండస్ట్రీ లో కొత్త డైరక్టర్ల కి అవకాశాలు ఇస్తు చిన్న సినిమాలు తీస్తూ విజయాలు అందుకుంటున్న వాళ్లలో శ్రీ విష్ణు మొదటి ప్లేస్ లో ఉంటాడు…ఆయన తీసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి…కానీ ఆయనకి గత కొద్దిరోజులుగా అసలు సక్సెస్ అనేది దక్కడం లేదు…అర్జున ఫల్గుణ భళా తందనాన అల్లూరి వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం సామజవరగమన( Samajavaragamana ) .వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది.
మొదటి సినిమాతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది.ఓవర్సీస్ లో అయితే భారీ లాభాలను సొంతం చేసుకుంది అని చెప్పాలి.విడుదలై రెండు వారాలు పూర్తవుతున్నా…

సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తూనే ఉందని చెప్పాలి.ఒకసారి ‘సామజవరగమన’ 2 వీక్స్ కలెక్షన్స్( Samajavaragamana Two Weeks Collections ) ని గమనిస్తే :
నైజాం 3.72 crసీడెడ్ 0.98 crఉత్తరాంధ్ర 1.27 crఈస్ట్ 0.69 crవెస్ట్ 0.48 crగుంటూరు 0.61 crకృష్ణా 0.63 crనెల్లూరు 0.34 crఏపీ + తెలంగాణ (టోటల్) 8.72 crరెస్ట్ ఆఫ్ ఇండియా 1.95 crఓవర్సీస్ 2.20 crవరల్డ్ వైడ్ (టోటల్) 12.87 cr (షేర్)

‘సామజవరగమన’ చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.రెండు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.12.87 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా రూ.8.67 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి.ఇప్పటికీ ఈ మూవీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుండటం గమనార్హం…శ్రివిష్ణు( Sreevishnu ) ఈ సినిమాతో మొదటి సారి తన కామెడీ టైమింగ్ మొత్తాన్ని బయట పెట్టాడు…
.







