'సిటాడెల్' పూర్తి చేసిన సామ్.. ఇక ఏడాది పాటు సినిమాలకు గుడ్ బై?

సమంత రూత్ ప్రభు( Samantha ) ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్.ఒకప్పుడు సౌత్ కు మాత్రమే ఈ భామ పరిచయం.

 Samantha Wraps Up Citadel India, Citadel, Samantha, Varun Dhawan, Bollywood , Sa-TeluguStop.com

స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత పర్సనల్ లైఫ్ కారణంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చింది.పుష్ప ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యిన ఈమెకు ఆ తర్వాత మరిన్ని అవకాశాలు వరించాయి.

బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.అయితే వరుస అవకాశాలు అందుకుంటూన్న సమయంలోనే హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడి ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకుంటుంది.

ఈ మధ్యనే షూట్ లలో పాల్గొంటూ మెల్లగా తన వృత్తి జీవితంలోకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది.ప్రెజెంట్ సామ్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా కూడా చేస్తుంది.

ఈ షూటింగ్ లో సమంత పాల్గొనగా ఆల్మోస్ట్ పూర్తి అయినట్టే తెలుస్తుంది.

ఇక బాలీవుడ్ లో ఈమె చేస్తున్న సిటాడెల్( Citadel) వెబ్ సిరీస్ పై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది.సమంత పోస్ట్ చేస్తూ ఈ సిరీస్ షూట్ పూర్తి అయినట్టు తెలిపింది.రాజ్ అండ్ డీకే తో దిగిన ఒక పిక్ షేర్ చేస్తూ వారి మద్దతుకు ధన్యవాదాలు చెప్పింది.

మీకు ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం అనేది చెడు విషయం అనిపించదు అంటూ సామ్ ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది.

అయితే ఖుషి( Khushi )తో పాటు సిటాడెల్ కూడా పూర్తి చెయ్యడంతో ఈమె ఇక ఏడాది పాటు షూటింగులకు బ్రేక్ ఇచ్చి ఫుల్ ఫోకస్ హెల్త్ మీదనే పెట్టనుంది అని తెలుస్తుంది.సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన సిటాడెల్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు.అలాగే ఖుషి సినిమాతో సామ్ సెప్టెంబర్ 1న ప్రేక్షకులను పలకరించబోతుంది.

ఈ సినిమాలతో ఈమె గ్యాప్ అనేది తెలియకుండా చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube