రష్యా తాజా నిర్ణయం వలన నాటో దేశాల వెన్నులో వణుకు పుడుతోందా?

దాదాపు రెండు సంవత్సరాలనుండి అంటే సరిగ్గా రష్యా – ఉక్రెయిన్( Russia – Ukraine ) యుద్ధ స్టార్ట్ అయిన నాటినుండి రష్యా అధ్యక్షుడు పుతిన్( Russian President Putin ) నాటో దేశాలకు శత్రువుగా మారాడు.కారణం అందరికీ తెలిసినదే.

 Is Russia's Latest Decision Sending Shivers Down Nato Nations' Spines, Russia, N-TeluguStop.com

అయితే నాటో దేశాలు ఏకమైవచ్చినా రష్యాని ఏమి పీకలేవు అన్నమాదిరి పుతిన్ వ్యవహారం కొనసాగుతోంది.నాటో దేశాలన్నిటికీ హెడ్ అయినటువంటి అమెరికా కూడా పుతిన్ వ్యవహారశైలికి తలొగ్గక తప్పడంలేదు.

ఇపుడు నాటో దేశాలు, ఈ దేశానికి హెడ్ అయినటువంటి అమెరికా దేశం ఇప్పుడు ఒక కిరాయి సైన్యానికి భయపడుతున్నాయని సమాచారం.ఆ కిరాయి సైన్యం గ్రూప్ పేరే వ్యాగనార్ గ్రూప్.

ఆ వ్యాగనార్ గ్రూపు అధ్యక్షుడి పేరు ప్రిగోజిన్‌( Prigogine ).అయితే ఈ వ్యాగనార్ గ్రూప్ ని సృష్టించింది ఎవరో అందరికీ తెలిసినదే.

Telugu Latest, Nato, Nri, Prigogine, Russia, Russian Putin-Telugu NRI

రష్యా దేశపు అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక బలంగా పేరుగాంచిన ఈ దళం అతనిమీద కుట్రకు దిగిన సంగతి విదితమే.అయితే అనతికాలంలోనే పుతిన్ వారిని అణచివేసాడు.ఆ తర్వాత 36 గంటల్లో అక్కడ నుండి బెలూరస్ కి వారు పారిపోవడం కూడా అందరికీ తెలుసు.అవును, మొదట పుతిన్ పైన తిరుగుబాటు చేసినవాడు ఆ తరువాత లొంగిపోయాడు.

ఇక ఆ తర్వాత తిరిగి సెయింట్ పీటర్స్ బర్గ్( Saint Petersburg ) కి వచ్చాడని అంటున్నారు.సెయింట్ పీటర్స్ బర్గ్ రష్యాలో వుంది.తన ఆయుధాలను స్వాధీనం చేయడానికే, బిగి రోవ్ అక్కడికి తిరిగి వచ్చాడని ప్రచారం జరుగుతోంది.

Telugu Latest, Nato, Nri, Prigogine, Russia, Russian Putin-Telugu NRI

అయితే, ప్రిగోజిన్‌ ఏ కారణం మీద వచ్చినా కూడా ఇప్పుడు యూరప్ ఇంకా నాటో దేశాలకు ఒక భయం పట్టుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.విషయం ఏమిటంటే, నాటో దేశాల సరిహద్దుకు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే బిగి రోవ్ తన సైన్యాన్ని మోహరించాడని వినికిడి.రష్యా వేసిన స్కెచ్ తోనే ఇప్పుడు వ్యాగనార్ సైన్యం ముందుకు దూకడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది.

అంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాటో దేశాలపైన పుతిన్ గురి పెట్టినట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయాలు తెలుసుకున్న నాటో దేశాలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాయని భోగట్టా.

అయితే రష్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో, దానికి నాటో దేశాలు ఎలా బదులిస్తాయో భవిషత్తులో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube