సంచలన ప్రకటన చేసిన ఐసీసీ.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న మహిళా క్రికెటర్లు..!!

ప్రపంచంలో క్రీడారంగంలో ఎక్కువగా ఇష్టపడేది మొదట ఫుట్ బాల్( Football ).ఆ తర్వాత రెండో స్థానంలో క్రికెట్( Cricket ) ఉంది.

 Icc Made A Sensational Announcement Women Cricketers Are Elated With Happiness,-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల లిస్ట్ చాలానే ఉంది.కానీ కొన్ని దేశాలు మాత్రమే అంతర్జాతీయ ట్రోఫీలు ఆడటానికి అర్హత సాధిస్తాయి.

ఇక ఇండియాలో అయితే క్రికెట్ కి విపరీతమైన ఆదరణ ఉంది.సినిమా హీరోలతో పాటు అంతర్జాతీయ టీం లో ఆడే క్రికెటర్స్ నీ అభిమానిస్తారు.

ఇండియా టీం గెలిపించడంలో ఒక్క మ్యాచ్ లో మెరిశాడు అంటే.అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అవుద్ది.

ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలో ప్రారంభంలో పురుషుల జట్టు మాత్రమే ఉండేది.

కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆడవాళ్ళ క్రికెట్ జట్లు కూడా ఏర్పడి దేశవాళీ స్థాయిలో మ్యాచ్ లు ఆడుతున్నారు.అయితే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో ప్రైజ్ మనీ విషయంలో పురుషులకే మొన్నటి వరకు ఎక్కువ అనే రూల్ ఉండేది.ఇదిలా ఉంటే తాజాగా ఐసీసీ క్రికెట్ ఈవెంట్( ICC cricket event ) లలో పురుషులు, మహిళల జట్లకు సమాన ప్రైజ్ మనీని అందిస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

దక్షిణాఫ్రికాలో డర్బన్ లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ ప్రకటనతో అంతర్జాతీయ స్థాయిలో రాణించే మహిళా క్రికెటర్లు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

ఇక ఇదే సమయంలో ఐసీసీ తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube