తెలుగు లో బుల్లితెర మీద చాలా బాగా ఫేమస్ అయిన షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో( Bigg Boss ) అనే చెప్పాలి…అందుకే ఈ షో సీజన్ ల మీద సీజన్ లు నడుస్తుంది…ఇక ఈ షో కి మొదటి సీజన్ లో ఎన్టీయార్ హిస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ లో నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు.ఇక సీజన్3 నుంచి నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా నాగ్ హోస్టింగ్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం ఓటీటీల హవా వల్ల బిగ్ బాస్ షో రేటింగ్స్ కొంతమేర తగ్గుతున్నా నాగ్ మాత్రం హోస్ట్ గా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుండటం గమనార్హం.బిగ్ బాస్ షో సీజన్7కు( Bigg Boss 7 ) నాగ్ హోస్ట్ గా చేయరని కామెంట్లు వినిపించడంతో పాటు వేర్వేరు సెలబ్రిటీల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి…
అయితే బిగ్ బాస్ షో సీజన్7కు కూడా నాగార్జున( Nagarjuna ) హోస్ట్ అని తెలుస్తోంది.
తాజాగా నాగ్ బిగ్ బాస్ సీజన్7 న్యూ లుక్ లీకైంది.కొత్త లుక్ లో నాగ్ అదుర్స్ అనేలా ఉన్నారు.
ప్రేక్షకులు సైతం నాగార్జున కొత్త లుక్ ను చూసి ఫిదా అవుతున్నారు.నాగ్ బిగ్ బాస్ షో సీజన్7 కోసం భారీ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది…

బిగ్ బాస్ షోను హోస్ట్ ను చేయడానికి నాగ్ కు మించిన మరో ఆప్షన్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్, నాని కూడా తమ హోస్టింగ్ తో మెప్పించినా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోలు బిగ్ బాస్ షోకు డేట్లు కేటాయించడం సులువు ఏ మాత్రం కాదని చెప్పవచ్చు.బిగ్ బాస్ షో సీజన్7 కంటెస్టెంట్లు( Bigg Boss 7 Contestants ) వీళ్లేనంటూ వేర్వేరు పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి…

క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను ఈ షో కోసం ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది.ఈ షో కోసం మాధవీలతను బిగ్ బాస్ షో నిర్వాహకులు సంప్రదించగా ఆమె సున్నితంగా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట.బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న శ్రావణి సమంతపూడి బిగ్ బాస్ షోలో పాల్గొననున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే ఈ షో ఎప్పుడు వస్తుందో అని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చాలా వరకు వెయిట్ చేస్తున్నారు…
.







