ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )తో పాటు అన్ని ఇండస్ట్రీలలో ఓటీటీ హవా నడుస్తోంది.చిన్న సినిమాలు కొన్ని పెద్ద సినిమాలు నేరుగా ఓటీటీ లోకి విడుదల అవుతున్నాయి.
ప్రేక్షకులు కూడా సినిమా థియేటర్లకు రావడం మానేశారు.ఎక్కువగా ఓటీటీ నే ఇష్టపడుతున్నారు.
విడుదలైన రెండు వారాల్లోపే ఓటీటీలోకి విడుదల అవుతుండడంతో థియేటర్ కు వెళ్లడం ఎందుకు దండగ అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.అయితే ఓటీటీలో వచ్చే సినిమాలకు సెన్సార్ లేకపోవడంతో కొన్ని సీన్స్ మరింత బోల్డ్‌గా ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ( Nargis Fakhri ) ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఓటీటీలో అలాంటి సీన్స్ పట్ల తాజాగా తన అభిప్రాయం చెప్పుకొచ్చింది నర్గీస్ ఫక్రీ.ప్రస్తుతం నర్గీస్ ఫక్రీ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన నటి ఓటీటీలో బోల్ట్ కంటెంట్( Bold Content )పై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తన దుస్తులు తీసివేయనని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాకు నగ్నంగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.ఏ ప్రాజెక్ట్‌లోనూ నగ్నంగా నటించను.
అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే తన దుస్తులు మాత్రం తీసివేయను.

అంతే కాకుండా స్క్రీన్‌పై లెస్బియన్‌గా నటించడం, మరొక స్త్రీని వివాహం చేసుకున్న స్త్రీగా చూపించడం తనకు ఇష్టముండదు.నేను దానిని పట్టించుకోను కూడా.ఏ పాత్ర అయినా అది కచ్చితంగా నటనలో ఓ భాగం అని తెలిపింది నర్గీస్ పక్రి.
ప్రస్తుతం ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఇటీవల కాలంలో ఓటీటీ( OTT ) లో విడుదల అవుతున్న మూవీలు వెబ్ సిరీస్ లలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే.








