ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువే ఇస్తుందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ నెలకొందన్న ఠాక్రే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పారు.రేవంత్ రెడ్డి మాట్లాడిన మొత్తం వ్యాఖ్యలు బయటకు రాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ముందు రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలని సూచించారు.రైతుల కోసం ఏం చేయడానికి అయినా కాంగ్రెస్ సిద్ధమని స్పష్టం చేశారు.







