మనకు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు.శరీరం లోపల ఏదోక అనారోగ్య సమస్య( health problem ) ఉంటుంది.
కానీ ఏం కాదులే అని మనం పెద్దగా పట్టించుకోం.చిన్నదే కదా అని వదిలేస్తూ ఉంటాం.
కొన్ని వ్యాధుల లక్షణాలు త్వరగా బయటపడవు.వ్యాధి ముదిరిన తర్వాత లక్షణాలు తెలుస్తాయి.
అయితే వ్యాధులను ముందే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల వెంటనే తగ్గించుకోవచ్చు.అదే వ్యాధి తీవ్రతరం అయిన తర్వాత తగ్గించుకోవడం చాలా కష్టతరమవుతుంది.
ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడవచ్చు.దీంతో మనకు ఏదైనా అనుమానం కలిగినప్పుడు టెస్టులు చేయించుకోవాలి.

పురుషులు, మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్స్( Health checkups ) కొన్ని ఉంటాయి.వాటిల్లో మగవారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టుల గురించి చూస్తే.అందులో ఒకటి యాన్యువల్ ఫిజికల్ ఎగ్జామినేషన్( Annual Physical Examination ).ఈ టెస్టులో బాడీ ఫిజికల్ కండీషన్, రక్తపోటు సంకేతాలు, గుండెపనితీరు, ఊపిరితిత్తుల ఆరోగ్యం, కొలెస్ట్రాల్ లెవల్స్ వంటి వాటిని క్షుణ్నంగా పరిశీలిస్తారు.ఇక దీంతో పాటు కొలొరెక్టర్ క్యాన్సర్ స్క్రీనింగ్( Colorectal Cancer Screening ) కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి.దీని వల్ల కొలొరెక్టర్ క్యాన్సర్ ను గుర్తించవచ్చు.

ఇక ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్, కొలెస్ట్రాల్, బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్టింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటి హెల్త్ చెకప్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి.ఇటీవల అన్ని వయస్సులవారికి తప్పనిసరిగా అధిక రక్తపోటు సమస్య వస్తుంది.అధిక రక్తపోటువల్ల హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.ఇక కొలెస్ట్రాల్, బ్లడ్ లిపిడ్ ప్రొపైల్ టెస్టింగ్ ద్వారా గుండె జబ్బులు, ఇతర హృదయ సంబంధ సమస్యలను వెంటనే గుర్తించవచ్చు.
ఇక ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ ను ఈజీగా గుర్తించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.ఈ టెస్టులు ఏడాదికి ఒకసారైనా మగవారు చేయించుకోవాలి.







