సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) వారసుడి కోసం అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.మోక్షజ్ఞ ( Mokshagna ) బాలయ్య వారసుడిగా ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడతారా అంటూ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ చెబుతున్నారే తప్ప ఈ విషయం గురించి ఎవరు ఎక్కడ అధికారకంగా ప్రకటన మాత్రం విడుదల చేయలేదు.అయితే ఈ విధంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో అభిమానులు సహనం కోల్పోయి ఈ విషయం గురించి ఆలోచించడమే మానేశారు.
ఇలాంటి తరుణంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి బాలయ్య అప్డేట్ ఇస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు.

ఇప్పటికే మోక్షజ్ఞ తన సినీ ఎంట్రీ కోసం పెద్ద ఎత్తున శిక్షణ తీసుకుంటూ కసరత్తులో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం బాలకృష్ణ తన భార్య వసుంధర ( Vasundhara ) కలిసి అమెరికా పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా అమెరికా పర్యటనలో భాగంగా బాలకృష్ణ తానా (Tana) సభల్లో పాల్గొన్నానారు.
అక్కడ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడుతూ తన కుమారుడు సినిమా ఇండస్ట్రీకి హీరోగా వచ్చే ఏడాది పరిచయం కాబోతున్నారని క్లారిటీ ఇచ్చారు.
అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్న విషయాన్ని మాత్రం బాలయ్య తెలియజేయలేదు.

మోక్షజ్ఞ బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 ( Aditya 369 ) సినిమా సీక్వెల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం కాబోతున్నారని ఈ సందర్భంగా బాలయ్య వెల్లడించారు.ఇందుకు సంభందించిన పనులు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనంతరం మొదలవుతాయని అన్నారు.అంటే వచ్చే సంవత్సరం ఈ లాంచ్ ఉంటుందన్నమాట.
ఇక మోక్షజ్ఞను బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తలు పై స్పందించినటువంటి బాలకృష్ణ అంతా దైవేచ్ఛ అని ఊరుకున్నారు.దీన్ని బట్టి చూస్తుంటే బహుశా బాలకృష్ణ కుమారుడిని బోయపాటి శ్రీను ఇండస్ట్రీకి లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో నటిస్తున్న భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.







