ఉద్యమకారులపై అవినీతి ఆరోపణలా: గుండాల సర్పంచ్...?

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రజలతో మమేకమై ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ గా గెలిచిన నన్ను రాజీనామా చేయాలంటూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, నాపై అవినీతి ఆరోపణలు నిరూపించినట్లయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రకాష్ అన్నారు.

 Allegations Of Corruption Against Activists Sarpanch Of Gundala, Allegations ,c-TeluguStop.com

మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులమైన తాము బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో స్థానిక ఎమ్మెల్యే మాపై అవినీతి ఆరోపణలు కార్యకర్తలతో చేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.20 సంవత్సరాలుగా పార్టీకి అనేక సేవలు చేసినప్పటికీ తగినంత గుర్తింపు ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు.నన్ను సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలనే ముందు ఇప్పటివరకు

బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ప్రజా ప్రతినిధులతో ఎంతమందిని రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్నారో చెప్పాలన్నారు.

భూకబ్జాలు,ఇసుక దందాలు,పిడిఎఫ్ బియ్యం దందాలు చేసే వారికి బీఆర్ఎస్ పార్టీ కొమ్ముకాస్తుందని,ఎలాంటి అవినీతికి పాల్పడని నన్ను రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం హేయమైన చర్యని అన్నారు.త్వరలో నారాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ లో మొదలు కాబోతుందని మీడియా ముఖంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube