ఖమ్మంలో దారుణం.. మద్యం మత్తులో కన్న బిడ్డలను హత్య చేసిన తండ్రి..!

ప్రస్తుత సమాజంలో కుటుంబ సభ్యులే దారుణమైన హత్యలకు పాల్పడుతున్నారు.కన్న పిల్లల చేతులలో తల్లిదండ్రులు.

 Drunken Father Killed His Own Children In Khammam Details, Drunken Father , Kill-TeluguStop.com

తల్లితండ్రుల చేతులలో కన్న పిల్లలు హత్యలకు గురవుతున్నారు.ఇలాంటి విషాదకర సంఘటనల గురించి వింటే భవిష్యత్తులో సమాజం ఎలా ఉంటుందో అనే ఊహనే భయభ్రాంతులకు గురిచేస్తుంది.

ఇలాంటి కోవలోనే ఓ వ్యక్తి మద్యం మత్తులో తన కన్న బిడ్డలను గొంతు నులిమి చంపేశాడు.ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని( Khammam ) మధిర మండలం రాయపట్నం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

రాయపట్నం గ్రామంలో శివరాం గోపాల్, ఏసుమణి దంపతులు నివాసం ఉంటున్నారు.రామకృష్ణ (7),( Ramakrishna ) ఆరాధ్య (6)( Aradhya ) అనే ఇద్దరు పిల్లలు సంతానం.

అయితే కుటుంబంలో తరచూ ఏవో గొడవలు జరుగుతూ ఉండేవి.సాయంత్రం పాఠశాల నుండి వచ్చిన ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకువచ్చి శివరాం చితకబాదాడు.

మద్యం మత్తులో ఉన్న శివరాం గోపాల్( Sivaram Gopal ) ఇద్దరు చిన్నారుల గొంతు నలిమి చంపేశాడు.

Telugu Khammam, Latest, Sudheer-Khammam

అనంతరం మృతదేహాలను దుప్పట్లో మూటకట్టి, ఇంట్లో దాచి పెట్టాడు.తరువాత తనకేం తెలియనట్టు మౌనంగా ఉన్నాడు.చీకటి పడుతున్న పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి చుట్టుపక్కల ప్రాంతాలు అంతా గాలించారు.

అయినా పిల్లల ఆచూకీ లభించలేదు.ఇంట్లో ఓ మూలన మూట కట్టిన దుప్పట్లు కనిపించగా.

వాటిని తెరిచి చూస్తే అందులో పిల్లల మృతదేహాలు కనిపించాయి.

Telugu Khammam, Latest, Sudheer-Khammam

హుటాహుటిన కుటుంబ సభ్యులు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లారు.అప్పటికే పిల్లలు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు.ఈ వార్త విన్న ఆ పిల్లల తల్లి ఏసుమణి తో పాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరారీలో ఉన్న శివరాం గోపాల్ పై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube