ప్రతి ఏడాది గుండెపోటు( Heart Attack )తో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మద్యపానం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ గుండెకు ముప్పు పెరుగుతుంది, క్రమంగా అది గుండెపోటుకు దారి తీస్తుంది, అందుకే గుండె ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పానీయాలు రోజు ఉదయం తీసుకుంటే గుండెపోటు వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది, మరి ఇంతకీ ఆ పానీయాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
సోయా పాలు.( Soya Milk ) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.ముఖ్యంగా కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో సోయా పాలు ది బెస్ట్ అని చెప్పుకోవాలి.పైగా సోయా పాలు మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.
మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఎముకలను దృఢపరుస్తాయి.
శరీర బరువును సైతం అదుపులో ఉంచుతాయి.అందుకే వారానికి రెండు సార్లు అయినా రోజు ఉదయం సోయా పాలను తీసుకునేందుకు ప్రయత్నించండి.
అలాగే టమాటో జ్యూస్( Tomato Juice ) కూడా గుండెకు ఎంతో మేలు చేస్తుంది.టమాటో జ్యూస్ కు కొలెస్ట్రాల్ ను కరిగించే గుణం ఉంది.టమాటో జ్యూస్ తాగితే గుండెకు ముప్పు తగ్గుతుంది.దాంతో గుండెపోటు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.అలాగే ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.కంటి చూపు పెరుగుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
ఇక గుండె ఆరోగ్యానికి మేలు చేసే పానీయాల్లో గ్రీన్ టీ( Green Tea ) ఒకటి.వెయిట్ లాస్‌కు మాత్రమే గ్రీన్ టీ ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తుంటారు.కానీ గ్రీన్ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకునే వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది.అందువల్ల గుండెపోటు బారిన పడకుండా ఉండాలని భావించే వారు తప్పకుండా రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ ని తీసుకునేందుకు ప్రయత్నించండి.
అందులోనూ ఉదయం సమయంలో తాగితే ఇంకా మంచిది.