Lokesh Kanagaraj : జవాన్ ప్రివ్యూపై ప్రశంసలు కురిపించిన లోకేష్.. షారుఖ్ పేరు చెప్పకపోవడంతో..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘జవాన్’( Jawan ).ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

 Lokesh Kanagarajs Comment About Atlees Jawan-TeluguStop.com

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్”.ఈ సినిమా హిందీలో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో హిందీతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెరిగాయి.షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్ ను నమ్ముకుని సినిమా చేస్తుండడంతో ఈసారి హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ సైతం ఒప్పుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు కీ రోల్స్ పోషిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichandran ) సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.

నిన్న ఈ మూవీ నుండి టీజర్ మాదిరిగా ప్రివ్యూను రిలీజ్ చేసారు.ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ ప్రివ్యూపై ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanakaraj ) కూడా సోషల్ మీడియా వేదికగా జవాన్ ప్రివ్యూపై స్పందించారు.జవాన్ ప్రివ్యూ( Javan preview ) అదిరింది అని స్టన్నింగ్ గా ఉందని.నా బ్రదర్ అట్లీ, అనిరుద్, విజయ్ సేతుపతికి సాలిడ్ డెబ్యూ ఇస్తున్నారని ఆనందంగా చెబుతూ టీమ్ అందరికి కంగ్రాట్స్ తెలిపారు.

అయితే ఈ పోస్ట్ లో ఎక్కడ కూడా షారుఖ్ ఖాన్ పేరు మెన్షన్ చేయకపోవడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube