ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ సినిమా పై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌( Ntr ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో దేవర ( Devara )అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా యొక్క షూటింగ్ ను అక్టోబర్‌ లేదా నవంబర్‌ వరకు ముగించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.

 Ntr And Prashanth Neel Movie Fans Talk ,devara Movie, Ntr, Prashanth Neel, Salaa-TeluguStop.com

ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మొదట అనుకున్న దాని ప్రకారం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది.కానీ ఇప్పటి వరకు సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యేది తెలియడం లేదు.

Telugu Salaar, Devara, Kgf, Prashanth Neel, Ramcharan, Rrr, Telugu, War Tollywoo

ఎన్టీఆర్‌ 31వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో అంటూ ప్రకటన వచ్చింది.కానీ ప్రస్తుతం సలార్‌ చేస్తున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్ మరో రెండు ఏళ్ల పాటు సలార్‌ తోనే బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.అంటే ఎన్టీఆర్‌ అప్పటి వరకు ఖాళీగా ఉండాలి.దేవర సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే హిందీ సినిమా వార్ 2 ( War 2 ) లో నటించేందుకు గాను ఎన్టీఆర్‌ డేట్లు కూడా ఇవ్వడం జరిగింది.

వార్ తర్వాత కూడా ఎన్టీఆర్‌ సినిమా లకు లైన్ క్లీయర్ గా ఉంది.ఇలాంటి సమయంలో ప్రశాంత్‌ నీల్ కోసం అంత సమయం వెయిట్‌ చేయడం అనేది తప్పుడు నిర్ణయం అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Salaar, Devara, Kgf, Prashanth Neel, Ramcharan, Rrr, Telugu, War Tollywoo

ఎన్టీఆర్ కూడా గుడ్డిగా అంతటి సమయాన్ని కోరుకునే అవకాశం లేదు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌(RRR ) సినిమా కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది.అందుకే ఇకపై ఎన్టీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా లను వరుసగా చేయాలని భావిస్తున్నాడు.అదే నిజం అయితే ఎన్టీఆర్‌.ప్రశాంత్‌ నీల్‌ కాంబో సినిమా మళ్లీ ఎప్పటికి ప్రారంభం అవుతుందో తెలియడం లేదు.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మాత్రం ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం లో సినిమా పై ఆశలు వదిలేసుకోవాలని భావిస్తున్నారు.

ఒక వేళ ఉంటే 2025 తర్వాతే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube