Pragya Jaiswal: జిమ్ లో కూడా అది వదలని ప్రగ్యా జైస్వాల్.. మరి ఇంత పిచ్చా?

చూడ్డానికి మంచి అందం, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోతుంది ప్రగ్యా జైస్వాల్.( Pragya Jaiswal ) ఇక ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Pragya Jaiswal: జిమ్ లో కూడా అది వదలని ప-TeluguStop.com

తెలుగులో చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను మాత్రం మంచి అభిమానులుగా మార్చుకుంది ఈ హాట్ బ్యూటీ.ఇక ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా 2012 లో హిందీ సినిమాతో పరిచయమైంది.

తర్వాత డేగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇక ఆ సినిమా తర్వాత మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక కంచె సినిమాలో నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా లలో నటించింది.

ఇక కాస్త గ్యాప్ తో బాలయ్య నటించిన అఖండ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి అవకాశాలు వస్తాయని చాలామంది అనుకున్నారు.

కానీ ఒక్క సినిమాలో అవకాశం రావడం కూడా చాలా కష్టంగా ఉందని చెప్పాలి.ఇక సినిమా పరంగా ప్రేక్షకులకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం బాగా టచ్ లో ఉంటుంది.

గ్యాప్ లేకుండా ఫోటోలు పంచుతూ బాగా రచ్చ చేస్తుంది.వేసుకునే డ్రెస్సెస్ బాగా తగ్గించేసి బాగా హీట్ పుట్టిస్తుంది.

లోతుగా తన అందాలను బయట పెట్టేస్తూ బాగా రచ్చ చేస్తుంది.ఇక జిమ్ములో( Gym ) కూడా గంటలు తరబడి కష్టపడి మంచి ఫిజిక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.ఇక తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.అవకాశాలు లేకపోయేసరికి సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది ప్రగ్యా.తన దృష్టి మొత్తం దర్శకనిర్మాతలపై పడాలని చూస్తుంది కానీ ఏ దర్శకుడు కూడా ఈ ముద్దుగుమ్మను అసలు పట్టించుకోవడం లేదు.

ఇక ఈమె కంటే ఎక్కువగా ఎక్స్పోజ్ చేసే హీరోయిన్స్ రావటంతో ఈమెను పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పాలి.ఎక్కడో ఒక ఇద్దరు దర్శకులు ఈమెకు అవకాశాలు ఇస్తున్నారు.దీంతో ఈమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

ఇక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పంచుకుంది ప్రగ్యా.అందులో తను జిమ్ము లో ఉన్నట్లు కనిపించగా ఒక దగ్గర కూర్చొని లిప్ స్టిక్( Lip Stick ) పెట్టుకుంటూ కనిపించింది.

ఇక తన ఫ్రెండ్ ఇదంతా వీడియో తీస్తూ ఇప్పుడు కూడా లిప్స్టిక్ పెట్టుకుంటుందని అనటంతో అది లిప్స్టిక్ కాదు లిప్ బామ్ అంటూ కవర్ చేసింది ప్రగ్యా.ప్రస్తుతం ఆ వీడియో కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫోటోలు వైరల్ అవ్వటంతో జిమ్ములో కూడా నీ పాడు మేకప్ వదలవా అంటూ.మేకప్ అంటే అంత పిచ్చా అంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.

https://instagram.com/stories/jaiswalpragya/3143679632682060805?igshid=MTc4MmM1YmI2Ng==
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube