ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ) ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఇద్దరు సాలిడ్ హిట్ అందుకుని కెరీర్ లోనే మరో మెట్టు ఎక్కారు.
గత నాలుగేళ్ళ క్రితం ఈ సినిమా వచ్చి మాసివ్ హిట్ అందుకుంది.

మరి మళ్ళీ ఇన్నేళ్లకు వీరి కాంబోలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది.”డబుల్ ఇస్మార్ట్‘( Double iSmart ) పేరుతో ఈ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అంటూ ఇటీవలే ప్రకటించారు.అయితే ఈ రోజు ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఓపెనింగ్ లో ఛార్మి క్లాప్ కొత్తగా హీరో రామ్ పై పూరీ స్వయంగా యాక్షన్ చెప్పారు.
”ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ అంటూ మొదలైన ఈ సినిమా రెగ్యురల్ షూట్ జులై 12 నుండి స్టార్ట్ కానుంది అని తెలిపారు.ఇక ఈ సినిమా ప్రకటన రోజునే వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ అంటూ ప్రకటించాడు.లైగర్ తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్న పూరీ మరింత కసితో ఈ సినిమాను సూపర్ హిట్ చేయాలని కసరత్తులు చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాను ఛార్మి కౌర్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పై విష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా రామ్ ప్రస్తుతం బోయపాటితో ‘స్కంద( Skanda )’ సినిమా చేస్తున్నాడు.శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు.
అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







