రౌడీ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda ) ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఇక ఈయన పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈయన బేబీ ( Baby ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆనంద దేవరకొండ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ ఆనంద్ దేవరకొండను రష్మిక ( Rashmika )గురించి ప్రశ్నిస్తూ తన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా రిపోర్టర్ మాట్లాడుతూ మీరు ఈ సినిమాలోని ఒక సాంగ్ రిలీజ్ చేయడం కోసం రష్మికను గెస్ట్ గా ఆహ్వానించారు.అయితే ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా కొందరు రష్మికను వదిన అంటూ కేకలు వేస్తూ పిలిచారు దీనిపై మీ సమాధానం అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆనంద్ దేవరకొండ కొంత పాటి అసహనం వ్యక్తం చేస్తూ తాను ఈ ప్రశ్నపై స్పందించదలచుకోలేదు అంటూ సమాధానం చెప్పారు.
ఈ విధంగా ఆనంద్ దేవరకొండ రష్మిక గురించి ఇలాంటి సమాధానం చెప్పడంతో రష్మిక విజయ్ దేవరకొండ గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం ఉందా అందుకే ఈయన మౌనం వహించారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే రష్మిక మందన్న గత కొంతకాలంగా విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నారని అయితే ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు అంటూ పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ సైతం సమాధానం చెప్పకపోవడంతో వీరి గురించే వచ్చే వార్తలలో నిజం ఉందని పలువురు భావిస్తున్నారు.