మెగా వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ramcharan Tej ) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా గ్లోబల్ స్థాయిలో నటుడిగా మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా రాంచరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
రామ్ చరణ్ కు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో రామ్ చరణ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా చిన్నప్పుడు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి ( Chiranjeevi ) చేతిలో తన్నులు తిన్న విషయాన్ని గుర్తు చేసుకొని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిన్నప్పుడు ఒకసారి నాన్న చేతిలో బాగా దెబ్బలు తిన్నానని చరణ్ తెలిపారు.అలా ఎందుకు దెబ్బలు తినాల్సి వచ్చిందనే విషయం గురించి చెబుతూ…తాను చిన్నప్పుడు గేటు బయట తన సెక్యూరిటీ ఇంకా వేరే అతను ఇద్దరు కూడా బాగా పోట్లాడుకుంటున్నారు.వారిద్దరూ కూడా బూతులతో తిట్టుకుంటున్నారు.
అలాంటి మాటలు నేను ఎప్పుడూ వినలేదు అవి అసలు బూతు మాటలు అన్న సంగతి కూడా నాకు తెలియదు.వారి మాటలు విని లోపలికి వెళ్లాను లోపలికి వెళ్ళగానే నాగబాబు( Nagababu ) బాబాయ్ అక్కడే కూర్చున్నారు.

బయట వారు అనుకున్న మాటలను నేను వెళ్లి నాగబాబు బాబాయ్ ని అనేసాను.బాబాయ్ ఒక్కసారిగా షాక్ అవుతూ అప్పుడే నాన్న షూటింగ్ నుంచి రావడంతో పైన తన గదిలో ఉన్నారు.బాబాయ్ నా చేయి పట్టుకుని నాన్న దగ్గరికి తీసుకెళ్లి అన్నయ్య వీడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు.అంటూ నాన్నకు కంప్లైంట్ చేశారు.దాంతో నాన్న మీరంతా బయటకు వెళ్ళండి అని నన్ను గదిలోకి వేసుకొని బాగా చివాట్లు పెట్టారు అంటూ తన తండ్రి కొట్టిన సంఘటనలను ఈ సందర్భంగా రామ్ చరణ్ బయటపెడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.








