కరెంట్‌ను ఆదా చేసుకునేందుకు లేదా కరెంట్ బిల్లులను భరించలేని వాళ్లు సోలార్ విద్యుత్ ( Solar electricity )ఏర్పాటు చేసుకుంటారు.సోలార్ వల్ల కావాల్సిన కరెంట్ 24 గంటలు వస్తుంది.
ఎలాంటి కరెంట్ ఛార్జీలు కూడా ఉండవు.దీంతో చాలామంది సోలార్ కరెంట్ ను తమ ఇంటికి లేదా పొలాలకు, వ్యాపారాల అవసరాల కోసం ఏర్పాటు చేసుకుంటారు.
అయితే సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలంటే సోలార్ ప్యానెళ్లను తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది.అయితే వీటిని ఒకచోట మాత్రమే ఫిక్స్ చేసుకోవాలి.
ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత వేరేచోటకు మార్చాలంటే కష్టతరం అవుతుంది.

అయితే ఇంగ్లండ్‌కు( England ) చెందిన సెగో ఇన్నోవేషన్స్( Sego Innovations ) అనే కంపెనీ ఒరిగామి సోలార్ ప్యానెళ్లను తయారుచేసింది.ఈ ప్యానెళ్లను ఒకచోట నుంచి మరోచోటకు మార్చుకోవచ్చు.అంటే.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులువుగా మడతబెట్టి తీసుకెళ్లవచ్చు.జపనీస్ కళ ఒరిగామి చాలా ప్రసిద్ది పొందింది.
ఆ కళ స్పూర్తితో ఈ సోలార్ ప్యానెళ్లను కంపెనీ అభివృద్ధి చేసింది.ప్రపంచంలోనే తొలి ఒరిగామి సోలార్ ప్యానెళ్లుగా ( Origami solar panels )ఇవి పేరు సంపాదించుకున్నాయి.
ఎక్కడికైనా టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా విద్యుత్ సరఫరా లేని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇవి ఉపయోగపడనున్నాయి.

20 వాట్, 50 వాట్, 100, 400 వాట్స్ లలో వీటిని తయారుచేశారు.ప్రీ ఆర్డర్లపై వీటిని డెలివరీ చేయనున్నట్లు సెగో ఇన్నోవేషన్ కంపెనీ( Sego Innovation Company ) ప్రకటించింది.జూన్ 6 నుంచే ప్రీ ఆర్డర్లను స్వీకరించడం మొదలుపెట్టినట్లు తెలిపింది.
ఈ సోలార్ ప్యానెళ్లకు బాగా డిమాండ్ పెరిగింది.ఏదైనా అడవి ప్రాంతాన్ని చూడటానికి వెళ్లి అక్కడే ఉండాల్సి వచ్చినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి.
అనేక రకాల డిజైన్లలో ఈ సోలార్ ప్యానెళ్లను తయారుచేశాయి.ఇవి కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.







