ఆ అవకాశం వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: అనుపమ

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ) .ఇలా మలయాళీ నటి అన్న పేరే గాని ఈమె తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగులో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Heroine Anupama Parameswaran About Rangasthalam Movie Chance,ramcharan,rangastha-TeluguStop.com

ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

Telugu Ramcharan, Rangasthalam, Samantha-Movie

ఇక పలు సందర్భాలలో ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ నాకు ఏ విషయమైనా నిజాయితీగా మాట్లాడటం అంటే ఇష్టం అలా మాట్లాడే వాళ్ళంటే కూడా తనకు ఇష్టమని తెలిపారు.అంతేకాకుండా ఉన్న ఈ చిన్న జీవితంలో పనికిరాని చెత్త గురించి ఆలోచిస్తూ జీవితాన్ని వృధా చేసుకోనని ఎప్పటికప్పుడు తన మైండ్లో ఉన్నటువంటి చెత్తను డిలీట్ చేస్తూ ఉంటా అంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చారు.అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.అయితే ఆ సంఘటనలు వారిని జీవితాంతం బాధ పెడుతూ ఉంటాయి.

Telugu Ramcharan, Rangasthalam, Samantha-Movie

ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటన అనుపమ పరమేశ్వరన్ జీవితంలో కూడా జరిగిందట.అయితే ఇప్పటికీ ఆ విషయం తనకు గుర్తుకు వచ్చిన చాలా బాధ కలుగుతుందని తెలిపారు.అయితే ఈమెను ఇంతగా బాధ పెడుతున్నటువంటి ఆ సంఘటన ఏంటి అనే విషయానికి వస్తే…కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు రామ్ చరణ్ (Ramcharan) హీరోగా నటించిన రంగస్థలం ( Rangasthalam) సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలో నటించే అవకాశాన్ని తాను కోల్పోయాను.

అయితే ఈ సినిమాని ఎందుకు మిస్ చేసుకున్నానా అని ఇప్పటికీ ఆ విషయం గుర్తొచ్చిన ప్రతిసారి తాను ఎంతో బాధపడుతూ ఉంటానని ఈ సందర్భంగా అనుపమ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube