అగ్రరాజ్యం అమెరికాపై విమర్శలు.. భారత్ నుంచి ఏం నేర్చుకున్నారు?

రష్యా, ఉక్రెయిన్( Russia, Ukraine ) మధ్య యుద్దానికి ఎండ్ కార్డ్ పడటం లేదు.ఏడాది కాలంగా యుద్దం కొనసాగుతూనే ఉంది.

 Criticism Of The Superpower America What Did They Learn From India , India, Amer-TeluguStop.com

ఈ యుద్దానికి ఎప్పుడు ఫుల్‌స్టాఫ్ పడుతుందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.ప్రపంచ దేశాలు కూడా ఆ రెండు దేశాల యుద్దం వల్ల నష్టపోతున్నాయి.

దిగుమతి, ఎగుమతులకు ఆటంకం కలుగుతుంది.అయితే యుద్దానికి ముగింపు పలకాల్సిందిగా ఆ రెండు దేశాలకు ప్రపంచంలోని చాలా దేశాలు సూచిస్తున్నాయి.

శాంతిని నెలకొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.కానీ ఆ రెండు దేశాలు మాత్రం దిగి రాడం లేదు.

ఎవరికి వారు పంతానికి పోతుండటంతో.యుద్దం నిర్వరామంగా కొనసాగుతూనే ఉంది.

Telugu America, India, Latest, Telugu Nri-Telugu NRI

అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్దం మొదలై 500 రోజులు దాటింది.యద్దాన్ని ఆపివేయాలని ఇప్పటికే రెండు దేశాలకు భారత్( India ) సూచించింది.ఇటీవల అమెరికా పర్యటనలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) సూచనలు చేశారు.అయితే అగ్రరాజ్యం అమెరికా మాత్రం రష్యాపై ఉక్రెయిన్ ను ఉసిగొల్పుతూనే ఉంది.

ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది.ప్రమాదకర కస్టర్ బాంబులను ఉక్రెయిన్ ను అమెరికా పంపిస్తుంది.

అలాగే అనేక మారణాయుధాలను ఉక్రెయిన్ కు అందించాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) నిర్ణయించారు.

Telugu America, India, Latest, Telugu Nri-Telugu NRI

భారత్ బాటలో తాము నడుస్తున్నామని చెబుతున్న అమెరికా మాత్రం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేయడం లేదు, మరింతగా రెండు దేశాలను రెచ్చగొడుతూనే ఉంది.భారత్ నుంచి శాంతిని నేర్చుకుంటున్నామని చెప్పే అమెరికా.ఉక్రెయిన్( Ukraine ) ను ఎందుకు రెచ్చగొడుతుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

బారత్ నుంచి నేర్చుకుంది ఇదేనా అంటూ ప్రపంచ దేశాల నాయకులు అమెరికాను ప్రశ్నిస్తున్నారు.రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం విషయంలో అమెరికాపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube