టెన్షనంతా సిట్టింగ్ లతోనే ! కేసీఆర్ ఏం చేస్తారో ?

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో అధికార పార్టీ బిఆర్ఎస్ లో టెన్షన్ పెరుగుతుంది.ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

 All The Tension Is Sitting! What Will Kcr Do, Kcr, Telangana, Teangana Governme-TeluguStop.com

మూడోసారి బిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే పట్టుదలతో ఉన్నారు.అందుకే కాంగ్రెస్, బిజెపిలను ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు అనేక పథకాలు, నిర్ణయాలను ప్రకటిస్తున్నారు.అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో సానుకూలత అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, వారిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఎమ్మెల్యేలు అనుమతి కావాల్సి ఉండడం, స్థానిక లీడర్ల వైఖరి, ఇవన్నీ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

Telugu Brs, Brs Mla Tickets, Congress, Teangana, Telangana, Telangana Cm-Politic

a

పథకాలు ప్రజలకు చేరేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుండడం, రేషన్ కార్డులు, ఆసరా, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, దళిత బంధు( Dalit Bandhu ) పథకాలకు ఎమ్మెల్యేలు సూచించిన వారికే ఆ పథకాలు అందుతూ ఉండడం, స్థానిక నాయకుల  కేవలం కొద్దిమందికి మాత్రమే ఈ పథకాలు చాలా కొద్దిమందికి మాత్రమే అందుతుండడం, ప్రతి పనికి కమిషన్లు తీసుకుంటున్నట్లు అధినేత కేసిఆర్ కి అందుతున్నాయట.సర్వేల్లోనూ ఈ విషయం తేలడం తో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాలా లేక ఆస్థానంలో మరో బలమైన అభ్యర్థిని ప్రకటించాలా ఆమె విషయంలో కెసిఆర్ కసరత్తు చేస్తున్నారట.

Telugu Brs, Brs Mla Tickets, Congress, Teangana, Telangana, Telangana Cm-Politic

ప్రజా సమస్యలను పట్టించుకోకుండా , ఇతర విషయాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు( BRS MLAs ) , ప్రజాప్రతినిధులు ఫోకస్ చేస్తుండడం వంటివన్నీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయనే విషయంపై కెసిఆర్ సీరియస్ గా ఉన్నారట.మరోసారి నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి బలమైన అభ్యర్థులను పోటీకి దింపాలని,  అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి మోహమాటాలకు వెళ్లకుండా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube