జుట్టు రాల‌డం నుంచి చుండ్రు వరకు అన్నిటికి చెక్ పెట్టే సూపర్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

హెయిర్ ఫాల్,( Hair Fall ) చుండ్రు,( Dandruff ) జుట్టు చిట్లడం, విరగడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం తదితర సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు.వీటి నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

 Super Home Remedy For All Hair Problems Details! Home Remedy, Hair Problems, Hai-TeluguStop.com

అయితే ఈ సమస్యల‌న్నిటికీ చెక్ పెట్టే ఒక సూపర్ రెమెడీ ఉంది.ఈ రెమెడీతో మీ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ పరార్ అవ్వాల్సిందే.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు,( Cloves ) వన్ టేబుల్ స్పూన్ మెంతులు,( Fenugreek Seeds ) రెండు రెబ్బలు ఎండిన కరివేపాకు, కొన్ని ఎండిన గులాబీ రేకులు, నాలుగైదు ఎండిన మందారం పువ్వు రేకులు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసుకున్న పదార్థాలు కూడా వేసి వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.

Telugu Damaged, Dandruff, Care, Care Tips, Fall, Pack, Problems, Remedy, Split E

ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ మరియు తయారు చేసి పెట్టుకున్న హెర్బల్ వాటర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసి గంట పాటు మూత పెట్టి వదిలేయాలి.

Telugu Damaged, Dandruff, Care, Care Tips, Fall, Pack, Problems, Remedy, Split E

అనంత‌రం ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట త‌ర్వాత శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.తెల్ల జుట్టు ( White Hair ) త్వ‌ర‌గా ద‌రిచేర‌కుండా ఉంటుంది.జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గు ముఖం పడతాయి.చుండ్రు సమస్య దూరం అవుతుంది.

హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube